బన్నీ బెర్లిన్ టూర్

మరిన్ని వార్తలు

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో నేషనల్ స్టార్ అయిపోయాడు. తెలుగు ఇండస్ట్రీకి ఇన్ని ఏళ్లుగా దక్కని అవార్డుని పుష్ప  మూవీతో సాధించి, చరిత్ర సృష్టించాడు. గంగోత్రి తో హీరోగా తెలుగుతెరకు పరిచయ మైన బన్నీ ఇన్ని సినిమాలు చేసినా, ఒక్క పుష్ప మూవీతో వరల్డ్ వైడ్ వైబ్రేషన్స్ పుట్టించాడు.  తన నటనతో, డైలాగ్స్ తో ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్నాడు. అందుకే బన్నీకి అన్ని ఇండస్ట్రీలోను క్రేజ్ ఉంది. ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.  ఇప్పుడు పుష్ప 2 తో బిజీగా ఉన్నాడు. పుష్ప రాజ్ కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఒకటి మెగా ఫాన్స్ ని సంతోషంలో ముంచింది.  బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్‌ లో పాల్గొనేందుకు బన్నీ బెర్లిన్ వెళ్ళాడంట.


ప్రతిష్టాత్మకమైన 74వ బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొనడానికి బెర్లిన్‌కు బయలుదేరాడు అల్లు అర్జున్. గురువారం ఉదయం హైదరాబాద్ ఇంటర్ నేషనల్ ఎయిర్పోర్ట్ లో  కనిపించారు.అల్లు అర్జున్ హీరో గా సుకుమార్ దర్శకత్వం వహించిన 2021 బ్లాక్ బస్టర్ ‘పుష్ప: ది రైజ్’ స్పెషల్ షోతో భారతీయ సినిమాకు ప్రాతినిధ్యం వహించడానికి సిద్ధంగా ఉన్నాడు బన్నీ.  ఈ  పర్యటనలో అంతర్జాతీయ చిత్రనిర్మాతలు, మార్కెట్ కొనుగోలుదారులతో చర్చలు జరపనున్నాడని  టాక్.  స్క్రీనింగ్‌తో పాటు ఇంటర్నేషనల్ మీడియాతో ఇంటరాక్ట్ కానున్నాడు.  దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS