ప్రజంట్ టాలీవుడ్ ట్రెండ్ మారింది. ఒకప్పుడు తెలుగు హీరోలు బాలీవుడ్ లో నటించటానికి తహ తహ లాడేవాళ్లు. అక్కడ అవకాశం రావటం అంటే ఎదో సాధించినట్టే అని గర్వంగా ఫీల్ అయ్యేవారు. నార్త్ వాళ్ళు సౌత్ వాళ్ళని చాలా తక్కువగా చూసేవారు, కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. అందని ద్రాక్షగా ఉన్న ఆస్కార్ ని ఒక తెలుగు సినిమా సాధించి, విదేశీ గడ్డ పై విజయకేతనం ఎగరేసింది. అప్పటి నుంచి, టాలీవుడ్ పై అందరి కన్ను పడింది. ముఖ్యంగా ఉత్తరాది నటీ నటులు తెలుగు సినీ పరిశ్రమ పై శ్రద్ద పెడుతున్నారు. ఒకప్పుడు హీరోయిన్స్ మాత్రమే దిగుమతి చేసుకునే ఇండస్ట్రీ, నెక్స్ట్ హీరోతో సమానంగా విలన్ కి ఇంపార్టెన్స్ ఉండటంతో, విలన్స్ ని కూడా ఉత్తరాది వారే ఉండేవారు. ముకేశ్ ఋషి, ఆశిష్ విద్యార్థి, షాయాజీ షిండే, మొదలైన వారు ఉండే వారు. వారి రాకతో తెలుగు విలన్స్ కి అవకాశాలు లేక ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ హీరోలే సౌత్ సినిమాల్లో విలన్స్ అవతారం ఎత్తుతున్నారు.
బాలయ్య, అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన 'భగవంత్ కేసరి' తో అర్జున్ రామ్ పాల్, ఆది పురుష్ తో సైఫ్ ఆలీఖాన్, తెలుగు తెరకి విలన్స్ గా పరిచయ మయ్యారు. ఇప్పుడు బాలీవుడ్ సీరియల్ కిస్సర్ ఇమ్రాన్ హష్మీ కూడా విలన్ గా తెలుగు వాళ్లకి పరిచయ మవుతున్నాడు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ 'OG ' లో నటిస్తుండగా, రిలీజ్ కి ముందే ఇంకో మూవీ లో విలన్ గా అవకాశం అందుకున్నాడు. బాలీవుడ్ లో రొమాంటిక్ హీరో గా పేరు పొందిన ఈ హీరో విలన్ గా ఎంతవరకు మెప్పిస్తాడు అని చాలా మంది ఆసక్తిగా ఉన్నారు.
టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ అడివి శేష్ చేసిన సినిమాల్లో గూఢచారి ఒకటి. శేషు కి ఈ మూవీ తో ప్రత్యేక గుర్తింపు వచ్చింది. బిగ్గెస్ట్ హిట్ అందుకుంది. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్గా డైరెక్టర్ విజయ్ కుమార్ సిరిగినేడి దర్శకత్వం లో తెరకెక్కుతున్న గూఢచారి 2 మూవీలో ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్నట్టు మేకర్స్ అఫీషియల్గా అనౌన్స్ చేశారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ లపై ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో నిర్మిస్తున్నారు.