ఇండియన్ ఆర్మీ సైనికుడి పాత్రకి జీవం పోస్తూ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రంలో అల్లు అర్జున్ పలికించిన అభినయం అందరిచేత శేభాష్ అనిపించుకుంటున్నది.
ఈ తరుణంలో నిన్న హైదరాబాద్ లో సైనికులకి, సైనిక అధికారులకి ఈ చిత్రం యొక్క ప్రత్యేక షోని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సైనిక అధికారులు మాట్లాడుతూ- అల్లు అర్జున్ నిజ జీవితంలో కూడా మిలిటరీ లో చేరితే బాగుంటుంది అని కోరారు. ఇక దీనికి వెంటనే బన్నీ స్పందిస్తూ- తాను ఇప్పటికే అందుకు సంబందించిన పేపర్స్ ని మిలిటరీ అధికారులకి పంపించినట్టుగా చెబుతూ, ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ తలుచుకుంటే నేను ఆర్మీలో చేరిపోవడం ఈజీ అని చమత్కరించాడు.
అయితే ఈయన మిలిటరీ లో చేరేది ఒక Honorary Designation గా మాత్రమే. వీరిని మిలిటరీ లో చేరినప్పటికి సరిహదుదుల వద్ద ఎటువంటి పోస్టింగ్లులు ఇవ్వరు. అయితే మరి కొంతమంది మాత్రం ఇది కేవలం పుకారు అని కొట్టెసేవాళ్ళు కూడా ఉన్నారు.
చివరికి అల్లు అర్జున్ మాత్రం ఒక్క హిట్‌ని ఈ చిత్రం తో తన ఖాతాలో వేసుకున్నాడు.