వెంకి-వరుణ్ లకి హీరోయిన్లు దొరికేశారు

By iQlikMovies - May 07, 2018 - 12:48 PM IST

మరిన్ని వార్తలు

విక్టరీ వెంకటేష్- మెగా అందగాడు వరుణ్ తేజ్ కలయికలో వస్తున్న F & F చిత్రానికి సంబంధించిన షూటింగ్ వివరాలు బయటకివచ్చాయి. అలాగే సినిమాలో నటించే ప్రధాన తారాగణం కూడా ఫిక్స్ అయిపోయారు.

తెలుస్తున్న వివరాల ప్రకారం, వెంకటేష్ పక్కన తమన్నా నటిస్తుండగా వరుణ్ తేజ్ పక్కన మెహ్రీన్ ని ఎంపిక చేసినట్టుగా తెలిసింది. ఇక ఈ చిత్ర షూటింగ్ జూన్ నెల నుండి నిరంతరాయంగా జరగనుంది. అన్ని కుదిరితే ఈ ఏడాది చివరికి గాని వచ్చే సంవత్సరం ప్రధమార్ధంలో కాని విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్టు సమాచారం.

వరుస విజయాలతో మంచి ఊపు మీదున్న దర్శకుడు అనిల్ రావిపుడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. మాస్ మహారాజ రవితేజతో రాజా ది గ్రేట్ చిత్రం తీసి ఒక మంచి కమర్షియల్ హిట్ కొట్టాడు. ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నాడు.

మొత్తానికి ఎప్పుడా ఎప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ మల్టీ స్టారర్ వచ్చే నెలలో పట్టాలేక్కనున్నది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS