బ‌న్నీ మాట విన‌ని త్రివిక్ర‌మ్‌

By iQlikMovies - November 24, 2018 - 11:04 AM IST

మరిన్ని వార్తలు

జులాయి, స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి... త‌ర‌వాత అల్లు అర్జున్ - త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. ఆగ‌స్టులోనే  ఈ సినిమాకి క్లాప్ కొట్టి, న‌వంబ‌రులో సెట్స్‌పైకి తీసుకెళ్లాల‌నుకున్నారు. కానీ... ఇప్ప‌టి వ‌ర‌కూ ఈ సినిమాకి సంబంధించిన ఒక్క అప్ డేట్ కూడా బ‌య‌ట‌కు రాలేదు. అస‌లు ఎప్పుడు మొద‌లెడ‌తారో కూడా చెప్ప‌డం లేదు. 

ఎందుకంటే.. ఈ క‌థ విష‌యంలో బ‌న్నీ, త్రివిక్ర‌మ్‌లు ఇంకా ఓ నిర్ణ‌యానికి రాలేద‌ని తెలుస్తోంది. బాలీవుడ్‌లో ఘ‌న విజ‌యం సాధించిన సోను కి టీటూ కీ స్వీటీ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేద్దామ‌న్న‌ది బ‌న్నీ ప్లాన్‌. త్రివిక్ర‌మ్ స్టైల్‌కి ఈ క‌థ బాగా స‌రిపోతుంద‌ని బ‌న్నీ భావించాడు. త్రివిక్ర‌మ్ కూడా... ఒకే అన్నాడు. కానీ ఇప్పుడు త్రివిక్ర‌మ్ త‌న నిర్ణ‌యాన్ని మార్చుకున్న‌ట్టు తెలుస్తోంది.

బాలీవుడ్ రీమేక్‌ని ప‌క్క‌న పెట్టిన త్రివిక్ర‌మ్ బ‌న్నీ కోసం ఓ కొత్త క‌థ త‌యారు చేసుకున్నాడ‌ట‌. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో రీమేక్‌లే శ్రేయ‌స్క‌రం అన్న‌ది బ‌న్నీ న‌మ్మ‌కం. వ‌రుస ఫ్లాపుల తో స‌త‌మ‌త‌మ‌వుతున్న బ‌న్నీ.. ఎలాగైనా ఈ సారి ఓ సేఫ్ ప్రాజెక్ట్ చేద్దామ‌నుకుంటున్నాడు. అందుకే.. రీమేక్ వైపు మొగ్గు చూపుతున్నాడు. కానీ త్రివిక్ర‌మ్ మాత్రం బ‌న్నీ మాట విన‌డం లేదు. 

`కొత్త క‌థే బెట‌ర్‌...` అంటూ... రీమేక్‌ని పూర్తిగా ప‌క్క‌న పెట్టేశాడ‌ట‌. ఈ విష‌యంలో బ‌న్నీ - త్రివిక్ర‌మ్‌ల మ‌ధ్య ఇంకా సీరియెస్ డిస్కర్ష‌న్స్ జ‌రుగుతున్నాయ‌ని, అందుకే ఈ సినిమా ఆల‌స్యం అవుతోంద‌ని స‌మాచారం.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS