అల్లు అర్జున్‌ - త్రివిక్రమ్‌ అంత ఫాస్ట్‌గానా?

మరిన్ని వార్తలు

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కుతోన్న సినిమాకి సంబంధించి తాజా అప్‌డేట్‌ ప్రచారంలో ఉంది. సినిమా చిత్రీకరణ ఆల్‌మోస్ట్‌ కంప్లీట్‌ అయిపోయిందనీ తెలుస్తోంది. లాస్ట్‌ షెడ్యూల్‌ని హైద్రాబాద్‌లో ప్లాన్‌ చేశారట. ఈ షెడ్యూల్‌ త్వరలోనే కంప్లీట్‌ కానుందట. ఈ షెడ్యూల్‌ కంప్లీట్‌ అయితే సినిమా దాదాపు ఓ కొలిక్కి వచ్చేస్తుందట.

 

సెట్స్‌ మీదికి వెళ్లేందుకు చాలా టైం తీసుకున్న ఈ సినిమా, వన్స్‌ సెట్స్‌ మీదికెళ్లాక, ఫాస్ట్‌గా షూటింగ్‌ కంప్లీట్‌ చేసుకున్నట్లే. తదుపరి చేయాల్సిన ప్రాజెక్టులు రెడీగా ఉండడంతో, గత రెండేళ్లుగా బన్నీ నుండి సినిమా రాకపోవడంతో, ఈ సినిమాని వీలైనంత ఎర్లీగా కంప్లీట్‌ చేయాలని త్రివిక్రమ్‌ - బన్నీ నిర్ణయించుకున్నారట. ఆ నిర్ణయాన్ని తూచా తప్పకుండా వర్క్‌లో పెట్టడంతో సినిమా షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. ఔట్‌ పుట్‌ చాలా బాగా వచ్చిందట. పూజా హెగ్దే ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఫాదర్‌ సెంటిమెంట్‌ ఉంటుందట.

 

కానీ, చాలా చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఆ కాన్సెప్ట్‌ని డీల్‌ చేశాడట త్రివిక్రమ్‌. తనదైన శైలి పంచ్‌ డైలాగులతో ఈ సినిమాతో రచ్చ రంభోలా చేసేందుకు త్రివిక్రమ్‌ సిద్ధంగా ఉన్నాడు. ఈ సినిమాకి 'అలకనంద' అనే టైటిల్‌ పరిశీలనలో ఉంది. దసరాకి సినిమాని విడుదల చేయాలనుకుంటున్నారట. వీలైతే అంతకన్నా ముందే బన్నీ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయనీ తెలుస్తోంది. మొత్తానికి ఎప్పుడెప్పుడా అని బన్నీ రాక కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌కిది గుడ్‌ న్యూసే కదా.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS