'అజ్ఞాతవాసి' సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ విషయంలో అల్లు అర్జున్ ఒకింత వెనక్కి తగ్గాడనీ, ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఓ సినిమా రావాల్సి వుండగా, అల్లు అర్జున్ కావాలనే త్రివిక్రమ్‌ని దూరం పెట్టాడనీ గుసగుసలు వినవస్తున్న సంగతి తెల్సిందే. అయితే, ఆ గాసిప్స్‌లో నిజమెంతుందన్నదానిపై భిన్నాభిప్రాయాలున్నాయి.
'అరవింద సమేత' రిజల్ట్ చూశాకనే, త్రివిక్రమ్‌తో సినిమాకి 'ఓకే' చెప్పాలని అల్లు అర్జున్ భావించాడనేది ఆ గాసిప్స్ సారాంశం. అయితే 'అరవింద సమేత' మంచి విజయాన్ని అందుకుంది. 'త్రివిక్రమ్ ఈజ్ బ్యాక్' అని అందరూ అంటున్నారు. దాంతో, అందరికన్నా ముందు అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్‌కి 'శుభాకాంక్షలు' తెలిపాడట. ఇది నిజమో కాదో గానీ త్రివిక్రమ్ పట్ల అల్లు అర్జున్ 'అతి' చేస్తున్నాడంటూ గాసిప్స్ తెరపైకొచ్చాయి. త్వరలోనే ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా పట్టాలెక్కనుందట.
విక్రమ్ కుమార్‌ని పక్కన పెట్టి, త్రివిక్రమ్‌తో సినిమాని అల్లు అర్జున్ ముందుకి తీసుకొచ్చాడట. అయితే త్రివిక్రమ్ ఇంకా 'అరవింద సమేత' మూడ్ నుంచి బయటకు రాలేదు. ఇంకొన్ని రోజులు ఈ సినిమా సక్సెస్‌ని ఆయన ఎంజాయ్ చేయాల్సి వుంది. ఆ తర్వాతే తన తదుపరి సినిమాపై త్రివిక్రమ్ పెదవి విప్పే అవకాశాలున్నాయి.
ఇంకోపక్క 'నా పేరు సూర్య' సినిమా తర్వాత, అల్లు అర్జున్‌కి ఎలాంటి సబ్జెక్ట్‌తో సినిమా చేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ప్రయోగాల జోలికి పోకుండా 'రేసు గుర్రం' లాంటి కమర్షియల్ ఎంటర్‌టైనర్ కావాలని అల్లు అర్జున్ అనుకుంటున్నాడట. మరి, ఆ కమర్షియల్ ఎంటర్‌టైనర్ త్రివిక్రమ్ డైరెక్షన్‌లో అల్లు అర్జున్‌కి సాధ్యమవుతుందా? వేచి చూడాలిక.