తార‌క్ రికార్డ్‌: అమెరికాలో వ‌రుస‌గా అయిదోసారి

By iQlikMovies - October 12, 2018 - 09:55 AM IST

మరిన్ని వార్తలు

'అర‌వింద స‌మేత వీర రాఘ‌వ‌'.... ప్ర‌స్తుతం ఎన్టీఆర్ అభిమానులు తార‌క మంత్రంలా జ‌పిస్తున్న పేరు ఇది.  గురువారం విడుద‌లైన ఈ చిత్రానికి మంచి స్పంద‌న వ‌స్తోంది. దానికి త‌గ్గ‌ట్టుగానే ఓపెనింగ్స్ అదిరిపోయాయి. ఓవ‌ర్సీస్‌లో వీర రాఘ‌వుడు త‌న ప్ర‌తాపం చూపించాడు. తొలి రోజే మిలియ‌న్ డాల‌ర్ల మార్క్‌ని అందుకున్నాడు. ఎన్టీఆర్ ఈ ఘ‌న‌త సాధించ‌డం ఇది వరుస‌గా 5వ సారి.

'టెంప‌ర్‌'. 'నాన్న‌కు ప్రేమ‌తో', 'జ‌నతా గ్యారేజ్‌', 'జై ల‌వ‌కుశ‌' చిత్రాలు మిలియ‌న్‌డాల‌ర్ల మార్క్‌ని అందుకున్నాయి. ఆ ఫీట్‌ని ఈసారి తొలిరోజే అందుకున్నాడు ఎన్టీఆర్‌. టోట‌ల్ ర‌న్‌లో ఈ సినిమా దాదాపు 2.5 మిలియ‌న్ డాల‌ర్ల మార్క్‌ని అందుకోబోతోంద‌ని, ఇది ఎన్టీఆర్ కెరీర్‌లోనే అత్య‌ధిక‌మ‌ని అక్క‌డి ట్రేడ్ వ‌ర్గాలు లెక్క‌గ‌డుతున్నాయి.  

త్రివిక్ర‌మ్‌కి ఓవ‌ర్సీస్‌లో వీర ఫ్యాన్స్ ఉన్నారు. అది కూడా అర‌వింద ఓపెనింగ్స్ ఈ స్థాయిలో ఉండ‌డానికి ఓ కార‌ణం. ఓ హీరో వ‌రుస‌గా 5సార్లు మిలియ‌న్ డాల‌ర్ల రికార్డుని అందుకోవ‌డం నిజంగానే ఓ అరుదైన విష‌యం. 

తెలుగు రాష్ట్రాల‌లోనూ 'అర‌వింద‌' ప్ర‌భంజ‌నాలు సృష్టిస్తోంది. ఎన్టీఆర్ కెరీర్‌లోనే తొలిరోజు అత్య‌ధిక వ‌సూళ్లు సాధించిన రికార్డుని `అర‌వింద` సొంతం చేసుకుంది. పూర్తి వివ‌రాలు తెలియాల్సివుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS