అల్లు అర్జున్ కోసం ముగ్గురు వెయిటింగ్

By iQlikMovies - April 16, 2018 - 18:24 PM IST

మరిన్ని వార్తలు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజా చిత్రం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా ఇంకొక 15 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఇక ఈ తరుణంలో ఆయన తరువాత చేయబోయే చిత్రం ఏంటి అనేదాని పైన చర్చ మొదలైంది.

అయితే ఆయనకి ప్రస్తుతం ఒక ముగ్గురు దర్శకులు కథలు సిద్ధం చేస్తున్నట్టుగా సమాచారం. ఆ ముగ్గురు ఎవరనగా- సుకుమార్, కొరటాల శివ & VI ఆనంద్. ఈ ముగ్గురు బన్నీ కోసం తమశైలిలో ఒక కథని తయారు చేసుకుంటున్నట్టు తెలిసింది.

ఈ ముగ్గురిలో యంగ్ దర్శకుడు VI ఆనంద్ కే ఎక్కువ గా అవకాశం ఉన్నట్టు తెలిసింది. ఎందుకంటే- ఒక్క క్షణం చిత్రం చూసిన వెంటనే బన్నీనే స్వయంగా VI ఆనంద్ ని ఒక కథ సిద్ధం చేయమన్నాడట.  అందువల్లే ఈ ఛాన్స్ VI ఆనంద్ ని ఈ అవకాశం వరించనుంది అని అందరు అభిప్రాయపడుతున్నారు.

మొత్తానికి బన్నీకి ఈ చిత్రం విడుదలకి ముందే కొత్త చిత్రం ఒకే అయిపోయే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS