అల్లు అర్జున్ ప్రస్తుతం `పుష్ష`తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆ తరవాత.. `ఐకాన్` పట్టాలెక్కే ఛాన్స్ వుంది. తదుపరి ప్రాజెక్ట్స్ విషయంలోనూ బన్నీ యమ స్పీడుగా నిర్ణయాలు తీసుకుంటున్నాడు. తాజా సమాచారం ఏమిటంటే.. తమిళనాట అగ్ర నిర్మాతగా వెలుగొందుతున్న ఎస్ థాను తో ఓ సినిమా చేయబోతున్నాఎస్ థాను బ్యానర్ లో బన్నీ ఓ చిత్రం చెయ్యనున్నట్టు తెలుస్తుంది. ఇప్పటి వారి వారి తుపాకి, అసురన్, తేర” లాంటి భారీ హిట్ చిత్రాలు వచ్చాయి. థాను ఇప్పటికే భారీ మొత్తంలో బన్నీకి అడ్వాన్స్ ఇచ్చాడని తెలుస్తోంది.
ఈ చిత్రానికి ఓ తమిళ దర్శకుడు టేకప్ చేస్తాడని టాక్ వినిపిస్తోంది. తమిళ దర్శకుడితో ఓ సినిమా చేయాలని ఎప్పటి నుంచో.. బన్నీ భావిస్తున్నాడు. ఆమధ్య మురుగదాస్ కూడా బన్నీకి ఓ కథ వినిపించాడు. కానీ అది బన్నీకి నచ్చలేదు. ఇప్పుడు మరుగ మరో కథ చెబితే, బన్నీ ఓకే చేసే అవకాశాలున్నాయి. ఆ సినిమాని థాను బ్యానర్లో చేయొచ్చు. ఒకవేళ మురుగదాస్ కాకపోతే... అట్లీ, లోకేష్ కనకరాజ్ లాంటి దర్శకులు కూడా బన్నీతో సినిమా చేయడానికయి ఉత్సాహం చూపిస్తున్నారు. వాళ్లలో ఒకరు ఈ ప్రాజెక్ట్ కి సెట్ అవ్వొచ్చు.