దర్శకుడు వేణు శ్రీరామ్ కలల ప్రాజెక్టు `ఐకాన్`. ఎన్నో ఏళ్ల నుంచి ఈ స్క్రిప్టు పట్టుకుని అల్లు అర్జున్ వెంట తిరుగుతున్నాడు. మధ్యలో హీరోలు మారతారని, నిర్మాతలు మారారని, అసలు ప్రాజెక్టే ఆగిపోయిందని వార్తలొచ్చాయి. అయితే అవన్నీ రూమర్లే అని తేలిపోయింది. బన్నీ ఈ సినిమా చేయడానికి ఓకే అన్నాడు. పుష్ష పార్ట్ 1 విడుదలైన వెంటనే... ఐకాన్ ని పట్టాలెక్కిస్తారన్నారు.
అయితే.. ఇప్పుడు మరోసారి ఈ ప్రాజెక్టుకి బ్రేక్ పడేలా ఉంది. ఈసారి మైత్రీ మూవీస్ నుంచి... అభ్యంరాలు వ్యక్తం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. పుష్ష సినిమాని మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. పుష్ష 1కీ.. పుష్ష 2కీ మధ్య వచ్చే గ్యాప్ లో `ఐకాన్` చేయాలన్నది బన్నీ ఆలోచన. అయితే.. ఈ రెండు సినిమాల మధ్య బన్నీ మరో సినిమా చేయడం... మైత్రీ మూవీస్ కి ఇష్టం లేదు. ఎందుకంటే.. ఐకాన్‌కీ, పుష్షకి గెటప్పులు వేరు. ఐకాన్ కోసం బన్నీ గెటప్ మార్చాల్సి వస్తుంది. ఐకాన్ అయిపోయిన తరవాత.. పుష్ష గెటప్ లో రావడానికి బన్నీ మరికొంత టైమ్ తీసుకుంటాడు. అంతే కాదు.. పుష్ష 1కీ, పుష్ష 2కీ మధ్య విడుదలైన ఐకాన్ రిజల్ట్ ఏమైనా తేడా వస్తే.. దాని ప్రభావం పుష్ష 2పై పడుతుంది. పుష్ష 1కీ, 2కీ మధ్య గ్యాప్ వస్తే.. ప్రేక్షకులు పుష్ష మ్యాజిక్ ని మర్చిపోతారు. ఇవన్నీ.. పుష్ష 2కి మైనస్‌లుగా మారతాయి. అందుకే.. ఈ రెండు సినిమాల మధ్యలో బన్నీ మరో సినిమా చేయడానికి మైత్రీ మూవీస్ అడ్డు పడుతోందని సమాచారం. అయితే.. నిర్ణయాధికారం ఇప్పటికీ బన్నీ చేతిలోనే ఉంది. బన్నీ మరో సినిమా చేయాలంటే.. చేస్తాడు. లేదంటే లేదు. మరి.... బన్నీ నిర్ణయం ఎటువైపు ఉందో?