మహాభారతం 1000కోట్లు రామాయణం 500కోట్లు

మరిన్ని వార్తలు

రామాయణం, మహాభారతం ఈ రెండు ఇతిహాసాల్లోని మూలాల్ని కథలుగా తీసుకుంటే కొన్ని వందలు, వేల కథలతో సినిమాలు పుట్టుకొస్తాయి. ఈ ఇతిహాసాల్ని సినిమాలుగా తీయాలనే ఆలోచనే ఓ మహాద్భుతం. ఎప్పట్నుంచో ఈ రకంగా అడుగులు కదులుతున్నాయి. యూనివర్సల్‌ స్థాయిలో వీటిని సినిమాలుగా రూపొందించాలనే ఆలోచన జరుగుతోంది. 'బాహుబలి' సినిమాతో యూనివర్సల్‌ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న రాజమౌళి మనసులో కూడా ఈ ఆలోచనకు మూలాలున్నాయని ఆయన మాటల్లోనే పలుమార్లు విన్నాం. అయితే ఈ సినిమాల విషయంలో వీటిని ఓ ఇండియన్‌ సినిమాగా కాకుండా యూనివర్సల్‌ సినిమాగా రూపొందించాలని అనుకుంటున్నారట. అత్యంత భారీ బడ్జెట్‌ అయిన వేయి కోట్లతో మహాభారతాన్ని, 500 కోట్ల బడ్జెట్‌తో రామాయణాన్ని తెరకెక్కించనున్నారట. ఈ మహా ప్రయత్నంలో తెలుగు సినీ ఇండస్ట్రీ నుండి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రాగా, మిగతా విభాగాల నుండి కూడా పలువురు సినీ ప్రముఖులు సిద్ధంగా ఉన్నారు. మహా భారతం విషయానికొస్తే ఈ కథని వి.ఎ.శివకుమార్‌ తెరకెక్కించబోతున్నట్లు తెలియ వస్తోంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కించనున్నారట. తెలుగు, తమిళ భాషల్లో సుపరిచిత నటుడైన మోహన్‌లాల్‌ భీముడి పాత్రలో నటించనున్నారనీ సమాచారమ్‌. అలాగే వివిధ సినీ విభాగాల నుండి పలువురు నట ప్రముఖులు వివిధ పాత్రలు పోషించేందుకు సిద్ధంగా ఉన్నారనీ తెలియ వస్తోంది. ఈ మహా ప్రయత్నం ఎప్పుడు కార్యరూపం దాల్చనుందో కానీ, ఒక వేళ దాల్చితే అది మహాద్భుతం కాక తప్పదు.

Tags:

JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS