గత కొన్ని నెలలుగా టాలీవుడ్ లో మెగా వర్సెస్ అల్లు అన్నట్టు ఉంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే చర్చ. కారణం అల్లు అర్జున్ వైసీపీ నేత శిల్పారవికి కాంపైనింగ్ చేయటమే. అక్కడ మొదలైంది చిచ్చు. దీనికి కొందరు అగ్నికి ఆజ్యం పోసినట్టు పెంచి పోషించారు. నాగబాబు కూడా తమకోసం నిలబడని వాడు మనవాడైనా పరాయివాడే అని ట్వీట్ చేసాడు. సాయి తేజ్ బన్నీని అన్ ఫాలో చేసాడు. దీనితో మెగా ఫాన్స్ రెచ్చిపోయారు. సోషల్ మీడియా మెగాఫాన్స్ వర్సెస్ అల్లు ఆర్మీగా మారింది. పవన్ ప్రమాణ స్వీకారం లో కానీ, విజయోత్సవ పార్టీలోకానీ బన్నీ ఎక్కడా కనిపించలేదు. బన్నీ నటించిన పుష్ప 2 పై కూడా మెగా హీరోలు స్పందించలేదు. నార్త్ లో పుష్ప 2 కలక్షన్స్ ఎంత పెరుగుతున్నా తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు రాకపోవటానికికారణం కూడా ఇదే.
ఇప్పడు సీన్ మారింది. పుష్ప 2 ప్రీమియర్ షో కోసం బన్నీ ఆర్టీసీ క్రాస్ రోడ్డులో ఉన్న సంధ్య థియేటర్ కి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో వెళ్ళటం అక్కడ తొక్కిసలాట జరిగి ఒక ఫ్యామిలీ లో రేవతి అనే మహిళ మరణించటం తెలిసిందే. ఈ క్రమంలోనే బన్నీని అరెస్టు చేశారు. ఈ ఒక్క ఘటనతో మెగా ఫ్యామిలీ మళ్ళీ అల్లు వారికి దగ్గరైంది. బన్నీకి ఆపద వస్తే మెగా కుటుంబం మొత్తం కదిలి అండగా నిలిచారు. బన్నీని అరెస్ట్ చేసారని తెలియగానే చిరంజీవి షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని అల్లు అరవింద్ ఇంటికి వెళ్లారు. నాగబాబు కూడా ఆరోగ్య సమస్యలున్నా హుటాహుటిన బన్నీ ఇంటికి వెళ్లారు. పవన్ కళ్యాణ్ ఏపీ నుంచి స్పెషల్ ఫ్లయిట్ లో బయలుదేరి వెళ్లారు.
బన్నీ శనివారం రిలీజ్ అయ్యి ఇంటికి రాగా పలువురు సినీప్రముఖులు ఇంటికి వెళ్లి కలిసివచ్చారు. చిరంజీవి భార్య సురేఖ అన్న అరవింద్ ఇంటికి వెళ్లి అల్లుడిని చూసి భావోద్వేగానికి లోనయ్యారు. బన్నీ కూడా ఈ ఘటనలతో వెనక్కి తగ్గాడు ఆదివారం సతీ సమేతంగా మావయ్యలని స్వయంగా వెళ్లి కలిసి ముచ్చటించారు. ఈ ఫొటోస్ వీడియోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఈ క్రమంలో మెగా వర్సెస్ అల్లు ముగిసినట్టే. కష్టం వస్తే అందరం ఒక్కటే అన్న, మెసేజ్ పాస్ చేసారు మెగా ఫ్యామిలీ. ఫాన్స్ కూడా ఇక నుంచి కలిసి బన్నీకి మంచి జరిగింది. మళ్ళీ మరొక్కసారి మెగా ఫాన్స్ మనసు గెల్చుకున్నారు బన్నీ.