కన్‌ఫ్యూజ్‌ తీర్చేసిన అల్లు వారబ్బాయ్‌.!

By iQlikMovies - April 15, 2019 - 12:00 PM IST

మరిన్ని వార్తలు

'ఎబిసిడి - అమెరికన్‌ బోర్న్‌ కన్‌ఫ్యూజ్డ్‌ దేశీ' సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు అల్లు శిరీష్‌. రకరకాల కారణాలతో ఎప్పుడో రావల్సిన ఈ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఎట్టకేలకు మే 17న రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ చేసుకుంది. ఈ సందర్భంగా 'ఏబీసీడీ' ట్రైలర్‌ని వదిలారు చిత్రయూనిట్‌.

 

ట్రైలర్‌ చాలా బాగుంది. ట్రైలర్‌ వచ్చాక ఈ సినిమాపై ఉన్న అనుమానాలన్నీ పటాపంచలైపోయాయి. శిరీష్‌ మేకోవర్‌కి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. హ్యాండ్‌సమ్‌ లుక్స్‌తో ఆకట్టుకుంటున్నాడు. అలాగే కాన్సెప్ట్‌ కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. అమెరికాలో పుట్టి, అమెరికాలో పెరిగి, లగ్జరీ లైఫ్‌ని ఎంజాయ్‌ చేస్తున్న కుర్రాడు ఇండియాకొచ్చి మిడిల్‌ క్లాస్‌ కుర్రాడిలా ఎలాంటి ఎక్స్‌పీరియన్స్‌ ఫేస్‌ చేశాడు అన్నదే ఈ సినిమా కాన్సెప్ట్‌. ట్రైలర్‌ విషయానికి వస్తే, 'డ్యాడ్‌ నువ్వు స్వయంకృషిలో చిరంజీవిలా ఫీలవ్వకు.. కష్టాల్లో నెట్టేస్తే మారిపోతానని నువ్వు అనుకోకు.. నేను రిచ్‌గానే పుట్టాను, రిచ్‌గానే పెరిగాను. రిచ్‌గానే ఉంటాను.. ' అని శిరీష్‌ చెప్పే డైలాగ్‌ ట్రైలర్‌కే హైలైట్‌గా ఉంది. 'నాకిష్టమైనవి మూడు 'ఈ'లు. ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎంజాయ్‌మెంట్‌, ఎగ్జైట్‌మెంట్‌..' అనే డైలాగ్‌ యూత్‌కి బాగా కనెక్ట్‌ అవుతోంది. శిరీష్‌కి ఫ్రెండ్‌ క్యారెక్టర్‌లో మాస్టర్‌ భరత్‌ నటించాడు. ఇక హీరోయిన్‌గా 'కృష్ణార్జున యుద్ధం' ఫేం రుక్సార్‌ థిల్లన్‌ నటించింది. ఈ ముద్దుగుమ్మని ట్రైలర్‌లో అందంగా చూపించారు.

 

సంజీవ్‌రెడ్డి ఈ సినిమాకి దర్శకుడు. చూడాలి మరి, లేట్‌ అయినా లేటెస్ట్‌గా వచ్చినట్లే కనిపిస్తున్నాడు అల్లు శిరీష్‌. మస్త్‌ ఎంటర్‌టైన్‌ చేసేలా ఉన్నాడు. హిట్‌ కళ కనిపిస్తోంది 'ఏబీసీడీ'కి. చూడాలి మరి ఈ హాట్‌ సమ్మర్‌లో మన ఈ ఎన్నారై కుర్రోడు తన పర్‌ఫామెన్స్‌తో కూల్‌గా ఎలా ఆకట్టుకుంటాడో. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS