శ్రియా భూపాల్ తెలుసు కదా? అఖిల్‌తో లవ్ మేటర్ నడిపి...పాపులర్ అయ్యింది. అఖిల్ - శ్రియా నిశ్చితార్థం కూడా జరగడం, అది కాస్త క్యాన్సిల్ అవ్వడం తెలిసిన విషయాలే. అయితే ఆ తరవాత శ్రియా భూపాల్ మీడియాకి దొరకలేదు. అయితే ఓ పార్టీలో మాత్రం అల్లు శిరీష్‌తో కలసి ఆడుతూ పాడుతూ పోజులివ్వడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ పిక్స్.. చూస్తే ఇద్దరి మధ్యా ఏదో ఉన్నట్టు ఉందే, అనే అనుమానాలు వ్యక్తం అవ్వడం సహజం. నెటిజన్లు కూడా ఆ కోణంలోనే గాసిప్పులు పుట్టించేస్తున్నారు. అయితే.. విషయం ఏమిటంటే.. అఖిల్‌తో శ్రియాకి ఎంగేజ్మెంట్ అవ్వకముందే శ్రియా - శిరీష్‌లు మంచి దోస్తులట. అందుకే ఇలా పార్టీలో కలసి నప్పుడు ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేశారు. అంతకు మించి ఏంలేదిక్కడ!