పెరుగుతున్న ట్రాఫిక్‌తో, రోడ్డు ప్రమాదాలు కూడా పెరిగిపోయాయి. అందుకే అందులో భాగంగా, ట్రాఫిక్ సమస్యలు, రోడ్డు ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు హైద్రాబాద్ ట్రాఫిక్ పోలీస్ విభాగం ఓ కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ యంగ్ హీరో, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, దర్శక ధీరుడు రాజమౌళి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రోడ్లపై హీరోయిజం చూపించరాదంటూ యువతకు సందేశమిచ్చాడు అల్లు అర్జున్. విద్యావంతులు పెరుగుతుంటే, ట్రాఫిక్‌పై అవగాహన తగ్గుతోందని అల్లు అర్జున్ చెప్పాడు. ట్రాఫిక్ నిబంధనలు పెరగాల్సిన అవసరం కన్నా, ట్రాఫిక్ నిబంధనల పట్ల అవగాహన పెరగాల్సి ఉందన్నాడు అల్లు అర్జున్. ఇంపోర్టెడ్ వెహికల్స్ బాగా పెరిగిపోతున్నాయి. అయితే మన దేశంలో అందుబాటులో ఉన్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం గల వాహనాలతో పోల్చితే రహదారులు అంత బాగా లేవని, రహదార్లను బట్టే వాహనాలు నడపవలసి ఉంటుందని రాజమౌళి చెప్పారు. సినీ సెలబ్రిటీలు చెప్పే మాటలు ఎక్కువమందికి రీచ్ అవుతాయి. అందులోనూ బిగ్ సెలబ్రిటీస్ అయిన అల్లు అర్జున్, రాజమౌళి వంటి వారు ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం ఆహ్వానించదగ్గ విషయం. ప్రాణం చాలా విలువైనది. పోతే తిరిగి రాదు. అయితే రోడ్డుపై వెళ్లేటప్పుడు కొంచెం సంయమనం పాఠించి, జాగ్రతగా ఉంటే మన విలువైన ప్రాణాన్నే కాదు, ఇతరుల ప్రాణాలను కూడా కాపాడిన వారమవుతాం అంతే. అయితే వీటిని ఎంతవరకు సమాజం ఫాలో అవుతుంది? అనేది వేరే విషయం.