దర్శకుడు పూరి జగన్నాధ్ ప్రస్తుతం సిట్ ఇన్వెస్టిగేషన్ లో పాల్గొంటున్నాడు.
ఇక దాదాపు 5 గంటల నుండి పూరిని విచారిస్తునే ఉన్నారు. సిట్ వర్గాల కథనం ప్రకారం, ఇన్వెస్టిగేషన్ అధికారులు అడుగుతున్న ప్రతి ప్రశ్నకు పూరి ఎటువంటి కంగారు లేకుండా సమాధానాలు చెబుతున్నాడట.
డ్రగ్ రాకెట్ సూత్రధారి అయిన కెల్విన్ కి పూరి ఎలా పరిచయం? డ్రగ్స్ ని టాలీవుడ్ లోని తన స్నేహితులకి ఇచ్చాడా? కెల్విన్ కి పూరి కి మధ్య జరిగిన మెసేజెస్, కాల్స్ గురించి ప్రశ్నించారట! అలాగే పూరి చే కెల్విన్ కి ఇవ్వబడినట్టుగా అనుమానిస్తున్న చెక్స్ విషయం కూడా ప్రస్తావించారట!
ఇక విచారణ మధ్యాహ్నం సమయం దాటడంతో ఇన్వెస్టిగేషన్ అధికారులు పూరి కోసం భోజనం కూడా తెప్పించినట్టు తెలుస్తుంది. మరి ఆయన విచారణ ఎప్పుడు ముగుస్తుంది, ముగిసాక ఆయన మీడియాతో మాట్లాడతారా లేదా అనేదాని పైన సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది.