అక్కినేని అమలా చాలా రోజుల తరువాత ముఖానికి రంగేసుకునేందుకు సిద్ధం అవుతున్నట్టు సమాచారం.
అందుతున్న సమాచారం ప్రకారం- అమలా అక్కినేని ఒక హిందీ చిత్రంలో ముఖ్యపాత్ర చేయడానికి అంగీకారం తెలిపారట. ఈ చిత్రంలో ఈమెకి జోడిగా ప్రముఖ నటుడు ఇర్ఫాన్ ఖాన్ నటించానునట్టు తెలుస్తున్నది. అయితే రెండు సంవత్సరాల క్రితం అమలా హిందీలో వచ్చిన హమారీ అధూరీ కహానీ చిత్రంలో అతిధి పాత్ర చేసింది.
ఇక ప్రస్తుతం అమలా చేయబోయేది అతిధి పాత్ర కాదని ఆ చిత్రంలో ఒక ప్రధాన పాత్ర అని తెలిసింది. ఈ చిత్రానికి సంబందించిన మరిన్ని విశేషాలు త్వరలోనే తెలియనున్నాయి.
మొత్తానికి అమలా తన భర్త, కొడుకుల మాదిరిగా నటనలోబిజీ కానుందనమాట!