ఇంకొక మూడు రోజుల్లో అక్కినేని వారింట పెళ్ళి బాజాలు మొగనున్నాయి. నాగార్జున పెద్ద కుమారుడు నాగ చైతన్య వివాహం నటి సమంతాతో ఈ నెల 6 & 7 తేదీలలో జరగనున్న విషయం విదితమే.
అయితే ఈ వివాహం గురించిన మరికొన్ని విషయాలని నాగార్జున మీడియాకి తెలియచేశాడు. అవేంటంటే- గోవాలో 6వ తేదిన హిందూ సంప్రాదాయ ప్రకారం అలాగే 7వ తేదిన క్రైస్తవ సంప్రాదాయ ప్రకారం వివాహం జరపనున్నారట. ఈ వివాహానికి కేవలం- అక్కినేని, రామానాయుడు అలాగే సమంతా కుటుంబసభ్యులు మాత్రమే హాజారవుతారు అని తెలిపాడు. ఇతర అతిధులని ఎవ్వరిని ఈ వివాహానికి ఆహ్వానించలేదని, కేవలం కుటుంబసభ్యుల సమక్షంలోనే ఈ కార్యక్రమం జరగనుందట.
అయితే రిసెప్షన్ మాత్రం హైదరాబాద్ లో ఎన్ కన్వెన్షన్ లో జరపనున్నట్టు తెలిపాడు. ఈ రిసెప్షన్ కి మాత్రం అన్ని రంగాల నుండి ప్రముఖులను ఆహ్వానించనున్నట్టు చెబుతూ ఆ తేదిని త్వరలోనే తెలియపరుస్తానని చెప్పి ముగించాడు.