అమలా పాల్- ఈ పేరు వింటే మంచి నటి అనే ప్రశంసలతో పాటుగా వ్యక్తిగత జీవితంలో నెలకొన్న వివాదాలు గుర్తొస్తాయి.
ఇక విషయానికి వస్తే, అమలా పాల్ పోయిన ఏడాది తమిళ డైరెక్టర్ విజయ్ తో వివాహబంధాన్ని తెంచుకున్న సంగతి విదితమే. అయితే ఈ మధ్య ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ- తాను రెండో పెళ్ళికి సిద్ధమేనని, అయితే అది ఎప్పుడు జరుగుతుందో తనకి కూడా తెలియదని చెప్పింది. అయితే ఈ సారి కూడా తాను ప్రేమ పెళ్లికే ఓటు వేస్తానని చెప్పింది.
దీనితో కోలీవుడ్ లో ఒక్కసారిగా పెద్ద చర్చ మొదలయ్యింది. ఈ స్టేట్మెంట్ వెనుక ఏమైనా హింట్ ఇచ్చిందా లేక సరదాకి చెప్పిందా అని గుసగుసలు వినిపిస్తున్నాయి.