కాంట్రవర్సిసియల్ డైరెక్టర్ గా ఇప్పటికే బాలీవుడ్ లో పేరుపొందిన అనురాగ్ కశ్యప్ ఇప్పుడొ మరొక సంచలనానికి దారి తీశాడు.
అయితే ప్రతిసారి సినిమాల వరకు ఆయన సంచలనాలు పరిమితమయ్యేవి కాని ఇప్పుడు ఆయన ఏకంగా తన జీవితానికి సంబందించే ఓ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అదేంటంటే- ఆయనకన్నా 21 ఏళ్ళ చిన్న వయసున్న శుభ్రా శెట్టితో ప్రేమలో పడడమే, ఇక ఈ విషయాన్ని ఆయన పరోక్షంగా సోషల్ మీడియా ద్వారా వారిరువురి ఫోటోలను పోస్ట్ చేశాడు.
దీనితో వీరి మధ్య ఏదో జరుగుతుంది అని కోడైకూస్తున్న సదరు మీడియా వారికి ఇప్పుడు కన్ఫర్మేషన్ దొరికినట్టయింది. ప్రస్తుతం శుభ్రా ఫ్యాంటం మూవీస్ ప్రొడక్షన్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తుంది. ఈ ఫ్యాంటం సంస్థకి అనురాగ్ కూడా ఒక యజమాని.
అనురాగ్ తన సినిమాలతోనే కాదు తన వ్యక్తిగత జీవతంతోను సంచలనాలు రేపుతున్నాడు.