దర్శకుడు విజయ్‌ని ప్రేమించి, పెళ్లి చేసుకుని.. రెండేళ్ల తరవాత విడాకులు ఇచ్చేసింది అమలాపాల్. ఇటీవలే విజయ్ కూడా మరో పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు అమలాపాల్ కూడా కొత్త జీవితానికి బాటలు వేసుకుంటోంది. ఇప్పుడు ఓ యువకుడితో అమలాపాల్ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయింది. కొత్త బాయ్ ప్రెండ్ గురించి మీడియా ముందు బయటపెట్టింది. ''అమ్మ ప్రేమ మాత్రమే స్వచ్ఛంగా ఉంటుంది. మన నుంచి ఏమీ ఆశించకుండా అమ్మ ప్రేమిస్తుంది. తను కూడా అలాంటివాడే.
నన్ను బాగా చూసుకుంటున్నాడు. నా గురించి తన ఉద్యోగాన్ని, కెరీర్‌ని కూడా వదిలేశాడు. నా ప్రతీ సినిమా తనకి చెప్పే చేస్తున్నా. తన సలహాలు తీసుకుంటున్నా. నాకు అన్నిరకాలా మార్గదర్శకంగా, ఆదర్శంగా ఉంటున్నాడు'' అంటూ గొప్పగా చెప్పింది. మరి పెళ్లెప్పుడు? అంటే మాత్రం సమాధానం దాటేస్తోంది. అమలాపాల్ నటించిన `ఆమె` ఈ వారమే విడుదల అవుతోంది. ఇందులో అమలాపాల్ ఓ సన్నివేశంలో నగ్నంగా నటించిన సంగతి తెలిసిందే.