అమలాపాల్‌ పెళ్లంట!

మరిన్ని వార్తలు

ముద్దుగుమ్మ అమలాపాల్‌ మళ్లీ పెళ్లి చేసుకుంటోందట.. ఇప్పుడీ న్యూస్‌ అంతర్జాలంలో వైరల్‌ అవుతోంది. అందుకు కారణం, బవీందర్‌ సింగ్‌ అనే వ్యక్తితో అమలాపాల్‌ కలిసి దిగిన కొన్ని ఫోటోలు నెట్టింట్లో దర్శనమివ్వడమే. సింగర్‌ అయిన బవీందర్‌ సింగ్‌కీ, అమలాపాల్‌కీ మధ్య గత కొన్నేళ్లుగా స్నేహ సంబంధం ఉంది. ఆ రిలేషన్‌తోనే అమలాపాల్‌తో సరదాగా కలిసి దిగిన కొన్ని ఫోటోల్ని బవీందర్‌ సింగ్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు.

 

ఇంకేం మన నెటిజన్లు ఊరికే ఉంటారా.. చెప్పండి. అమలాపాల్‌ పెళ్లంట.. అనే హ్యాష్‌ ట్యాగ్‌తో ఈ ఫోటోల్ని వైరల్‌ చేసేశారు. అంతే.. ఈ గాసిప్‌కి ఖంగు తిన్న బవీందర్‌ సింగ్‌ వెంటనే ఆ ఫోటోల్ని డిలీట్‌ చేసేశాడు. అయితే, ఈ ఫోటోలు బవీందర్‌ సింగ్‌ చాన్నాళ్ల క్రితమే పోస్ట్‌ చేశాడట. కానీ, తాజాగా వెలుగులోకి రావడం, గాసిప్‌ దారులు ఫ్రెష్‌ ఫ్రెష్‌గా వాటిపై గాసిప్స్‌ పుట్టించేయడం చకచకా జరిగిపోయాయి.

 

గతంలో తమిళ డైరెక్టర్‌ ఎ.ఎల్‌.విజయ్‌ని వివాహం చేసుకున్న అమలాపాల్‌ కొన్ని పర్సనల్‌ రీజన్స్‌తో ఆ వివాహ బంధాన్ని రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవలే విజయ్‌ మరో అమ్మాయిని వివాహమాడాడు. ఈ క్రమంలోనే అమలాపాల్‌ కూడా మరో వివాహం చేసుకోనుందని తాజా ఫోటోస్‌ వంకతో గాసిప్స్‌ పుట్టుకొచ్చాయి. కానీ, అందులో నిజం లేదు కాబోలు. అందుకే బవీందర్‌ సింగ్‌ వెంటనే ఫోటోలు డిలీట్‌ చేసి, అప్రమత్తమైపోయాడు. మరోవైపు అమలాపాల్‌ ప్రస్తుతం కెరీర్‌లో ఫుల్‌ బిజీగా ఉంది. ఓ వైపు సినిమాలూ, మరోవైపు వెబ్‌ సిరీస్‌.. అంటూ కాస్త కూడా తీరిక లేకుండా గడుపుతోంది. మరి ఈ పెళ్లి గాసిప్స్‌ అమలాపాల్‌ వరకూ చేరాయో లేదో తెలీదు కానీ, ఒకవేళ చేరినా ఒక ఇప్పటికైతే, అమలాపాల్‌ స్పందించాల్సిన అవసరం కూడా లేదేమో.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS