మిసమిసలాడే మిస్సందం హాయ్‌ హాయ్‌ హమేషా.!

మరిన్ని వార్తలు

బాలీవుడ్‌ బ్యూటీ అయినా ముద్దుగుమ్మ అమీషా పటేల్‌ తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించింది. తెలుగులో నటించినవి కొన్ని సినిమాలే అయినా కానీ స్టార్‌ హీరోలతో నటించింది. పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌తో 'బద్రి' సినిమాలో సరయు పాత్ర పోషించిన అమీషా పటేల్‌కి మంచి ఫేమ్‌ వచ్చింది. 

తర్వాత యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌తో 'నరసింహ'లోనూ, సూపర్‌స్టార్‌ మహేష్‌బాబుతో 'నాని' సినిమాలోనూ తన హాట్‌ హాట్‌ అందాల ఆరబోతతో కుర్రకారు మదిలో గంటలు మోగించింది. 'బద్రి' సినిమా అమీషాకి సూపర్‌ డూపర్‌ హిట్‌ ఇచ్చింది కానీ, మిగిలిన రెండు సినిమాలూ ఆశించిన విజయాల్ని అందించలేదు. ఇప్పుడు బాలీవుడ్‌లో కూడా పెద్దగా సినిమా అవకాశాలు రావడం లేదీ ముద్దుగుమ్మకి. అందుకే సోషల్‌ మీడియాలో తన హాట్‌ హాట్‌ సొగసుల్నిలా ప్రదర్శనకు పెట్టేసింది. 

ఈ ఫ్రీ షో అవకాశాల కోసమా? లేక టైం పాస్‌ కోసమో తెలీదు కానీ, అమ్మడి గ్లామర్‌ షో ఆల్రెడీ ఎంజాయ్‌ చేసిన ఆడియన్స్‌కి మళ్లీ కొత్త కిక్‌ వచ్చేలా ఇదిగో ఇలా దర్శనమిచ్చింది. స్టూల్‌పై డిఫరెంట్‌ పోజులో కూర్చొని, తన హాట్‌ హాట్‌ ధైస్‌ని కెమెరా కంటికి క్లోజ్‌గా ఉంచి, కుర్రోళ్ల మతులు పోగొట్టేస్తోందిలా.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS