బాలీవుడ్‌కి చెక్కేసిన 'లై' బ్యూటీ.!

మరిన్ని వార్తలు

'లై' సినిమాతో తెలుగు తెరకు పరిచయమై బ్యాక్‌ టు బ్యాక్‌ నితిన్‌తో రెండు సినిమాల్లో నటించిన బ్యూటీ మేఘా ఆకాష్‌. సినిమాల విడదులకు ముందు సెన్సేషన్‌ సృష్టించిన ఈ ముద్దుగుమ్మ రెండు సినిమాలతోనూ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దాంతో మూడో సినిమాకి అవకాశం రాలేది. అయితేనేం అమ్మడు ఒక్కసారి బాలీవుడ్‌లో తన అదృష్టం చెక్‌ చేసుకోవాలనుకుంది. 

నక్క తోక తొక్కింది. మొదటి ప్రయత్నంలోనే ఈ బ్యూటీకి అక్కడ మంచి ఆఫర్‌ దక్కింది. 'శాటిలైట్‌ శంకర్‌' అనే టైటిల్‌తో తెరకెక్కుతోన్న సినిమాలో ఈ ముద్దుగుమ్మ హీరోయిన్‌గా నటిస్తోంది. సూరజ్‌ పంచోలి హీరోగా నటిస్తున్నాడు. తెలుగులో కొంచెం బొద్దుగా కనిపించిన ఈ బ్యూటీ ఇప్పుడు స్లిమ్‌గా మరింత అందంగా తయారైంది. బాలీవుడ్‌ బాబులకు జీరో సైజ్‌ అందాలంటేనే మక్కువ ఎక్కువ. అందుకే ముందు జాగ్రత్తతో వ్యవహరించి, ఫిజిక్‌ మీద కాన్‌సన్‌ట్రేషన్‌ చేసింది. అనుకున్న టైంలోనే కష్టపడి బరువు తగ్గించి జీరోసైజ్‌ ఫిజిక్‌ని సొంతం చేసుకుంది. జీరోసైజ్‌లో ఘ ఘ మేఘా ఆకాష్‌ మరింత ముద్దుగా కనిపిస్తోంది. 

టాలెంట్‌ ఉండీ టాలీవుడ్‌లో నిలదొక్కుకోలేకపోయిన ముద్దుగుమ్మలు బాలీవుడ్‌లో సత్తా చాటుతున్నారు. అలాగే టాలీవుడ్‌లో సత్తా చాటకపోయినా, బాలీవుడ్‌లో అయినా తన ఉనికిని చాటుకుంటుందేమో మేఘా ఆకాష్‌ చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS