చెర్రీ మూవీలో బిగ్ బి?

మరిన్ని వార్తలు

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నుంచి RRR తరవాత ఏ మూవీ రాలేదు. ఈ విషయంలో మెగా ఫాన్స్ కొంచెం అసంతృప్తిగా ఉన్నారు. వారి అసంతృప్తి ని పోగెట్టేలా చరణ్ వరుస ప్రాజెక్ట్స్ కి ఓకే చెప్పి, ఏడాదికి రెండు సినిమాలతో వచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నాడని సమాచారం. శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమాతో ఈ ఏడాది ఎండింగ్ లో థియేటర్స్ లో సందడి చేయనున్నాడు. నెక్స్ట్ బుచ్చి బాబు సానాతో RC 16 షూటింగ్ స్టార్ట్ చేసాడు. అదికాక సుకుమార్ తో ఒక సినిమా కమిట్ అయ్యాడు. బుచ్చి బాబు మొదటి సినిమా ఉప్పెన తోనే బ్లాక్ బస్టర్ హిట్ సాధించాడు. బెస్ట్ ఫిల్మ్ గా నేషనల్ అవార్డు కూడా వచ్చింది. బుచ్చి బాబు సినిమాలో చెర్రీ నటించటం ఏంటని అప్పటివరకు ఆందోళనలో ఉన్న ఫాన్స్ ఉప్పెన కి నేషనల్ అవార్డు రావటంతో చెర్రీ నిర్ణయం పట్ల నమ్మకంగా ఉన్నారు. 


RC16 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ, స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఉత్తరాంధ్రలో జరిగే కథ అని తెలుస్తోంది. రీసెంట్ గా ఈ మూవీ పూజా కార్య క్రమాలు జరుపుకుంది. చెర్రీకి జోడిగా జాన్వీ కపూర్ నటిస్తోంది. మిగతా అప్డేట్స్ కోసం ఫాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే అదిరిపోయే అప్డేట్ ఒకటి వచ్చింది. ఈ చిత్రంలో బిగ్.బి అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. చరణ్ కి తాతయ్య పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. తాతా, మనవడి మధ్య రిలేషన్ హైలైట్ గా ఉంటుందని. ఇదే ప్రధానమని తెలుస్తోంది. తాత కోరిక నెరవేర్చే మనవడిగా చెర్రీ నటిస్తున్నాడు.  


ఇంకో బాలీవుడ్ హీరో బాబీ డియోల్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నట్టు సమాచారం. చాలా కాలం తరవాత ఏ ఆర్ రెహమాన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తుండటం విశేషం. మైత్రి మూవీ మేకర్స్ తో కలిసి, వెంకట సతీష్ కిలారు ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మొత్తానికి చెర్రీ సినిమాలో బాలీవుడ్ నటీనటులే ఎక్కువ కనిపించేలా ఉన్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS