టిల్లు క్యూబ్ కథ ఏంటి?

మరిన్ని వార్తలు

బాక్సాఫీస్ దగ్గర టిల్లు మోత మోగిస్తున్నాడు. ఎక్కడ చూసినా టిల్లు మ్యాజిక్ కనిపిస్తోంది. ఫేస్ బుక్, వాట్స్ అప్, ఇలా సోషల్ మీడియాలో టిల్లు స్క్వేర్ సినిమా క్లిప్స్ తెగ ట్రెండ్ అవుతున్నాయి. డీజే టిల్లు మూవీకి  సీక్వెల్ గా వచ్చిన టిల్లు స్క్వేర్ సిద్ధూ జొన్నలగడ్డకి కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ఇచ్చింది. రిలీజైన మూడు రోజుల్లోనే 68 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసింది. ఓవర్సీస్ లో కూడా మంచి వసూళ్లు రాబడుతోంది. అమెరికాలో టిల్లు క్రేజ్ మాములుగా లేదు. ఈ వారం టాప్ 10 బాక్స్ ఆఫీస్ మూవీస్ లిస్టులో  టిల్లు స్క్వేర్ 8th ప్లేస్ లో ఉండటం గమనార్హం. మూడు రోజుల్లో అమెరికాలో 1.83 మిలియన్ డాలర్స్ పైగా వసూళ్లను సాధించింది. రెండు మూడు రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లో చేరనుంది టిల్లు స్క్వేర్. మెగా స్టార్ చిరంజీవి టిల్లు స్క్వేర్ సినిమా చూసి సిద్ధుని ఇంటికి పిలిచి అభినందించటం విశేషం.  


సీక్వెల్స్ హిట్ అవటమే గొప్ప విషయం, అలాంటిది మొదటి పార్ట్ కి మించి సెకండ్ పార్ట్ హిట్ అవటం అంటే రికార్డు అనే చెప్పాలి. సీక్వెల్ గా వచ్చి హిట్ అయినవి తెలుగులో బాహుబలి సినిమా మాత్రమే ఉంది. ఇప్పుడు టిల్లు స్క్వేర్ యాడ్ అయ్యింది. ఈ హిట్ సిరీస్ ని కంటిన్యూ చేస్తానని, సిద్దు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఈ మూవీకి సీక్వెల్ అనౌన్స్ చేస్తూ టిల్లు క్యూబ్ ఉంటుందని, అధికారికంగానే ప్రకటించారు మూవీ యూనిట్. కథ కూడా ఎలా ఉండబోతోందో రివీల్ చేసాడు సిద్దు.


ఇది విన్న ఫాన్స్ టిల్లు క్యూబ్ పై అప్పుడే, ఆశలు పెంచుకున్నారు. టిల్లు క్యూబ్ కథ గూర్చి సిద్దు చెప్తూ  మొదటి పార్ట్ లో అమ్మాయి మోసం చేసే పాయింట్ ఉంది. టిల్లు స్క్వేర్ లో అలాంటి మోసంతో పాటు మాఫియా డాన్, మిషన్ లాంటివి ఉన్నాయి. పార్ట్ 3 లో టిల్లుకి సూపర్ పవర్స్ వస్తే ఏం చేస్తాడు? ఎలా బిహేవ్ చేస్తాడు? గాల్లోకి ఎగరడం, టిల్లు సూపర్ హీరో అయితే ఎలా ఉంటుంది అనే పాయింట్ మీద కథ ఉంటుంది అని వెల్లడించాడు. త్వరలోనే స్క్రిప్ట్ వర్క్ మొదలు పెట్టనున్నట్లు కూడా తెలిపారు. అంతే కాదు ఏ మూవీలో ఒక స్టార్ హీరోయిన్ నటించనున్నట్లు కూడా టాక్.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS