బిగ్ బీ ఒక రాజకీయ ప్రముఖిడితో అమితుమీకి సిద్ధపడ్డాడు.
వివరాల్లోకి వెళితే, ఆమ్ ఆద్మీ పార్టీ కి చెందిన కుమార్ విశ్వాస్.. అమితాబ్ తండ్రిఅయిన హరివన్ష్ రాయి బచ్చన్ కి సంబందించిన ఒక కవితని ఒక కార్యక్రమంలో ఉపయోగించారు. అయితే ఆ కవితను ఉదహరించడానికి ముందు అమితాబ్ బచ్చన్ అనుమతి తీసుకోలేదు.
ఈ విషయం అమితాబ్ దృష్టికి రాగా, ఇది కాపీరైట్ చట్టం కిందకి వస్తుందని దీని పై తగు చర్యలు ఉంటాయి అని తెలిపాడు. దానితో కుమార్ విశ్వాస కి లీగల్ నోటిసులు పంపడం జరిగింది.
అయితే దీనికి కుమార్ సమాధానమిస్తూ- ఈ వీడియో పెట్టడం వల్ల యుట్యూబ్ లో రూ 32 వచ్చాయని చెబుతూ వాటిని అమితాబ్ బచ్చన్ కి పంపించాడు. ఈ అంశం ఇప్పుడు అంతర్జాలం లో వైరల్ అయింది.