అమితాబ్ బచ్చన్ కి కరోనా నిర్ధారణ...

మరిన్ని వార్తలు

కరోనా...ఈ మహమ్మారి ప్రపంచాన్ని ఎంతల వనికిస్తోందో చెప్పనవసరం లేదు. ఇంటి నుండి అడుగు బయటికి పెట్టాలంటేనే భయ పడుతున్నారు ప్రజలు. చిన్న పెద్ద అని లేకుండా కరోనా ఏ ఒక్కరిని వదలడం లేదు.  రాజకీయ నాయకుల నుండి సినీ ప్రముఖుల వరకు ఇంటికే పరిమితం అవుతున్నారు. అయినప్పటికీ కొంతమంది ప్రముఖులకు కోవిడ్ 19 సోకింది.


అయితే ఈ శనివారం ఇండియన్ మెగాస్టార్ అయిన అమితాబ్ బచ్చన్ కి కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. ఈ విషయం స్వయంగా తానే ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా తెలియచేసారు. తనతో పాటు కుమారుడు అభిషేక్ బచ్చన్ కి కూడా కరోనా నిర్దారణ అయింది. ఈ విషయం తెలిసి తన అభిమానులు, శ్రేయోభిలాషులు బిగ్ బి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS