'తొలిప్రేమ‌'తో వ‌ర్మ లింకు

మరిన్ని వార్తలు

ఉన్న‌ట్టుండి ప‌వ‌న్ క‌ల్యాణ్ మీద ప‌డ్డాడు రాంగోపాల్ వ‌ర్మ‌. `ప‌వ‌ర్ స్టార్‌` టైటిల్ తో ఓ సినిమా చేస్తున్నాడు. ఎన్నిక‌ల త‌ర‌వాత క‌థ అని ట్యాగ్ లైన్ పెట్టి `జ‌న‌సేన‌` పార్టీ ఎన్నిక‌ల్లో ఓడిపోయిన త‌ర‌వాత వ‌వ‌న్ ఏం చేశాడు? ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకున్నాడు? అనే ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల్ని త‌న క‌థ‌లో చూపించ‌బోతున్నాడు. వ‌ర్మ పొలిటిక‌ల్ సెటైర్ల ఈ సినిమాలో ఎలా పేల‌తాయో.. అని అంతా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

 

ఇప్పుడు `ప‌వ‌ర్ స్టార్‌` రిలీజ్ డేట్ కూడా ఫిక్స‌యిన‌ట్టు టాక్‌. జులై 24న ఈసినిమాని విడుద‌ల చేయ‌బోతున్నార్ట‌. జూలై 24తో ప‌వ‌న్ కి, త‌న అభిమానుల‌కు మంచి బాండింగ్ ఉంది. సూప‌ర్ హిట్ చిత్రం `తొలి ప్రేమ‌` ఆ రోజే విడుద‌లైంది. ఆ సినిమాతోనే ప‌వన్ స్టార్ అయిపోయాడు. అలా సెంటిమెంట్ గా ప‌వ‌న్‌కి బాగా అచ్చొచ్చిన రోజునే వ‌ర్మ త‌న సినిమాని వ‌ద‌ల‌బోతున్నాడ‌న్న‌మాట‌. ఇటీవ‌లే `ప‌వ‌ర్ స్టార్` షూటింగ్ మొద‌లైంది. అయితే ఈలోగా.. వర్మ ఈ సినిమాని పూర్తి చేస్తాడా? లేదా? అనేది కాస్త డౌటు కొడుతోంది. ఎంతో టైమ్ లేదు మ‌రి. కాక‌పోతే.. వ‌ర్మ సినిమాలు వేగంగా తీయ‌డంలో దిట్ట‌. పైగా ఇది 30 నిమిషాలో, 40 నిమిషాలో ఉంటుందంతే. కాబ‌ట్టి.. అనుకున్న స‌మ‌యానికి పూర్తి చేసేయ‌గ‌ల‌డు. ‌


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS