బాలకృష్ణ ‘పైసా వసూల్’ కి సంబందించిన స్టంపర్ రిలీజ్ అయిన నాటి నుండి ఈ చిత్రం పైన అంచనాలు పదింతలు అయ్యాయి.
అయితే ఈ చిత్రానికి బిగ్ B- అదే అమితాబ్ బచ్చన్ కి ఒక లింక్ ఉందట. అదేంటంటే- ఈయన అతిధిగానే పైసా వసూల్ కి సంబందించిన ఆడియో రిలీజ్ వేడుకలు జరగనున్నాయట! ఇప్పటికే అమితాబ్ ని డైరెక్ట్ చేసిన పూరి జగన్నాధ్ కి ఆయన తో ఉండే సాన్నిహిత్యం వలన అదే విధంగా బిగ్ B పైన బాలకృష్ణ అభిమానం ఉండడంతో ఈ ఆడియో విడుదల కార్యక్రమానికి ఆయనను ఆహ్వానించనున్నారు.
ఆయన రావడం పక్కా అనే సమాచారం బయటకి రావడంతో, ఇక ఆయనకి వీలున్న రోజే ఈ ఆడియో విడుదల కార్యక్రమం జరగనుంది. మొత్తానికి ఈ ఆడియో కి బిగ్ B వస్తుండడంతో, ఈ చిత్రానికి ఉన్న కలర్ మారిపోయింది.
ఇక ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కి అనూప్ రుబెన్స్ సంగీతం అందించాడు.