బాహుబలితో ప్రపంచవ్యాప్తంగా పేరుప్రఖ్యాతులు తెచ్చుకున్న ప్రభాస్ కి ఇప్పుడు తన తాజా చిత్రం ‘సాహో’ తో కొత్త తలనొప్పులు మొదలయ్యాయి.
బాహుబలి విడుదలకి ముంది సాహో కి అనుకున్న కథ వేరే అట! అయితే ఇప్పుడు ఆయనకి బాహుబలి తరువాత వచ్చిన హైప్ వలన చిత్ర కథ మార్చినట్టు సమాచారం. ఈ చిత్ర కథని పక్కా కమర్షియల్ చిత్రంగా మలిచినట్టు యూనిట్ వర్గాల సమాచారం.
అయితే ఈ సాహో సినిమా విషయాలని ఆగష్టు 15లోపు అభిమానులతో పంచుకోనున్నట్టు ఈ చిత్ర దర్శకుడైన సుజీత్ తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు.
ఇక ఈ చిత్రానికి సంబందించిన షూటింగ్ ఈ మధ్యనే మొదలవగా, మరిన్ని వివరాలు ఇంకొక రెండు వారాలలో బయటకి రానున్నాయి.