బాలీవుడ్ లో లెజెండ్ అయిన అమితాబ్ బచ్చన్ గురించి ఇంట్రో ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఆయనకు భారతదేశంలోనే కాకుండా పలు ఇతరదేశాలలో కూడా అభిమానులు ఉన్నారు. ఆయన 78 ఏళ్ల వయసులో కూడా ఎంతో ఉత్సాహంగా సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇదిలా ఉంటే ఆయన కుటుంబం నుంచి ఒక కొత్త హీరో బాలీవుడ్ లో అడుగుపెట్టబోతున్నాడట. బచ్చన్ సాబ్ మనవడు అయిన అగస్త్య నంద త్వరలోనే హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధం అవుతోందట.
అగస్త్య ఎవరంటే అమితాబ్ కుమార్తె శ్వేత బచ్చన్- నిఖిల్ నందాల ముద్దుల కుమారుడు. అభిషేక్ బచ్చన్ కు మేనల్లుడు. 19 ఏళ్ల వయసున్న ఈ అగస్త్య ను హీరోగా పరిచయం చేస్తామని ఇప్పటికే పలువురు బాలీవుడ్ ఫిలింమేకర్లు బిగ్ బీ ని సంప్రదించారట. కుర్రాడికి కూడా తాతయ్య బాటలో హీరోగా వెండితెరపై మెరవాలని కోరిక ఉందట. అందుకే త్వరలోనే అరంగేట్రం ఉంటుందని బాలీవుడ్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే సుశాంత్ మరణం తర్వాత నెపోటిజంపై సోషల్ మీడియాలో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. స్టార్ కిడ్స్, ప్రమఖ కుటుంబాల నుంచి వచ్చిన హీరో హీరోయిన్లపై తీవ్రంగా ట్రోలింగ్ కూడా జరుగుతోంది. మరి ఈ బచ్చన్ గారి మనవడు ఆ ట్రోలర్ల కచ్చను ఎలా భరిస్తాడో వేచి చూడాలి.