అమ్మమ్మగారిల్లు కలెక్షన్స్ తెలిస్తే షాక్ అవుతారు

By iQlikMovies - May 29, 2018 - 07:30 AM IST

మరిన్ని వార్తలు

యంగ్ హీరో నాగ శౌర్య, హీరోయిన్ షామిలి జంటగా రూపొందించిన చిత్రం- అమ్మమ్మగారిల్లు. ఈ చిత్రానికి మొదటి షో నుండే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దీనితో ప్రతి షోకి ఈ చిత్రాన్ని చూసే ఆడియన్స్ పెరుగుతున్నారు.

ఇక మూడురోజుల కలెక్షన్లు ఒకసారి చూస్తే- మొదటి మూడురోజుల్లో నైజం ఏరియా లో దాదాపు రూ 1 కోటి వసూలు చేయగా మిగతా ఏరియాలలో కూడా దాదాపుగా రూ 2 కోట్లు వసూలు చేసినట్టుగా సమాచారం.

దీన్నిబట్టి ఈ సినిమాకి కలెక్షన్లు పెరగడం స్పష్టంగా తెలుస్తున్నది,  వేసవి కావడం, ఇది మంచి కుటుంబ కథా చిత్రం అవ్వడంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఈ చిత్రాన్ని చూడడానికి ఇష్టపడుతున్నట్టుగా అర్ధమవుతున్నది.

మరో నాలుగైదు రోజుల పాటు ఈ సినిమా ఇలానే కొనసాగితే ఈ చిత్రం మరిన్ని కోట్లు వసూలు చేసే అవకాశం ఉన్నట్టుగా ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS