త్వరలో #ANR బయోపిక్...

మరిన్ని వార్తలు

తెలుగు ఇండస్ట్రీ లో ప్రస్తుతం బయోపిక్ ల హవా నడుస్తున్నది. దానికి తగట్టుగానే దర్శక-నిర్మాతలు, రచయితలు కూడా అటువంటి కథల వైపే మొగ్గుచూపుతున్నారు. తాజాగా బాలకృష్ణ తన తండ్రి జీవితాన్ని ఆధారం చేసుకుని #NTR అనే చిత్రానికి అంకురార్పణ చేశారు.

మరి ఈ చిత్ర ప్రకటనతో స్పూర్తి పొందాడో లేదో తెలియదు కాని, అక్కినేని నాగార్జున కూడా ఈ బయోపిక్ రూట్ లో వెళితే ఎలా ఉంటుంది అన్న ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. ప్రచారంలో ఉన్న వార్తల ప్రకారం, అక్కినేని నాగేశ్వర రావు గారికి తెలుగు చలనచిత్ర పరిశ్రమకి విడదీయరాని సంబంధం ఉన్న సంగతి తెలిసిందే, ఆయనకి ఉన్న అశేష అభిమాన ఘనం గురించి కూడా తెలియనిది కాదు.

అలాగే ఈ మధ్య కాలంలో మహానటి చిత్రం సాధించిన విజయం కూడా అక్కినేని కుటుంబసభ్యులని ఆలోచనలో పడేసినట్టుగా తెలుస్తున్నది. ఇప్పటికైతే నాగార్జున ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు అని, ఒకవేళ తీసుకుంటే మాత్రం అది సంచలనమే అవుతుంది.

అన్ని కుదిరితే, మనం త్వరలోనే ఏఎన్ఆర్ బయోపిక్ ని చూడొచ్చు...

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS