బికినీ బ్యూటీగా పాపులర్ అయిన బ్రిటిష్ బ్యూటీ అమీ జాక్సన్ ఇండియన్ సినిమా స్క్రీన్‌పై వెలిగిపోతోంది. తెలుగులోనూ ఓ సినిమా చేసింది. రామ్‌చరణ్ హీరోగా రూపొందిన 'ఎవడు' సినిమా అది. అందులో ఓ పాటలో బికినీ సొగసులతో హల్‌చల్ చేసిన అమీ జాక్సన్, శంకర్ 'ఐ' సినిమాలోనూ గ్లామర్ ప్లస్ పెర్ఫామెన్స్‌తో అదరగొట్టేసింది. లేటెస్ట్‌గా '2.0' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న ఈ బ్యూటీ, సోషల్ మీడియాలో తన అందచందాల్ని ఒలకబోస్తూ అభిమానులకి 'టచ్'లోనే ఉంటోంది. ఈ ఫొటోలో బికినీ, ఆపై స్టైలిష్‌గా ఓ కోట్‌తో అమీ జాక్సన్ అదరగొట్టే లుక్‌తో కుర్రకారు గుండెల్లో 'కోత'కి కారణమవుతోంది. మోడలింగ్ రంగం నుంచి వచ్చిన తనకు బికినీలో కన్పించడం కొత్త కాదని చెప్పే అమీ జాక్సన్, ఎప్పటికప్పుడు ఫ్యాషన్ ట్రెండ్స్ ఫాలో అవుతూ, స్టైల్‌కి న్యూ డెఫినిషన్స్ చెప్పడం తనకిష్టమని చెబుతుంటుంది. బాలీవుడ్‌లో అయినా, టాలీవుడ్‌లో అయినా, కోలీవుడ్‌లో అయినా సెలక్టివ్‌గా మాత్రమే సినిమాలు చేస్తుందట అమీ జాక్సన్.