అందాల భామ అమీ జాక్సన్, బ్రిటిష్ బ్యూటీ అని చాలామందికి తెలుసు. అందుకేనేమో అందాల ప్రదర్శనలో అస్సలేమాత్రం మొహమాటపడదు. ఈ బ్యూటీ లేటెస్ట్ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. డ్రైవింగ్ సీట్లో అమీ జాక్సన్ అందాల ఆరబోతకి కుర్రకారు చిలిపి గుండెలకి హార్ట్ ఎటాక్ రాకుండా వుంటుందా? అంతలా 'అన్ బటన్డ్' ఫొటోతో కిర్రాకు పుట్టించేస్తోంది అమీ జాక్సన్. త్వరలో '2.0' సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించబోతోంది ఈ బ్యూటీ. తెలుగులో 'ఎవడు' సినిమాలో నటించిన అమీ జాక్సన్, తమిళంలో రెండు మూడు సినిమాల్లో నటించింది. బాలీవుడ్లోనూ అమీ జాక్సన్ పలు సినిమాల్లో నటించి, మంచి పేరు తెచ్చుకుంది. 'ఐ' తెలుగుతోపాటు, తమిళ, హిందీ భాషల్లో విడుదలైన సంగతి తెల్సిందే. అంతకు మించిన భారీ బడ్జెట్తో '2.0' సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అమీతో సినిమా అంటే ఆషామాషీ కాదండోయ్. ఏమాటకామాటే చెప్పుకోవాలంటే అమీ అందాల తార మాత్రమే కాదు, అందమైన నటనకి కూడా చిరునామానే.
Classic click of #AmyJackson @iamAmyJackson pic.twitter.com/S7zVrWEOxX
— Nettv4u (@Nettv4uTamil) 8 October 2018