త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఏ హీరో పనిచేసినా, ఆ హీరోతో ఆయనకు ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడిపోతుంటుంది. ఈ మాటల మాంత్రికుడు 'అజ్ఞాతవాసి' సినిమాతో ఫెయిల్యూర్ చవిచూవాడు. అయితేనేం, యంగ్ టైగర్ మాత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై పూర్తి నమ్మకంతో వున్నాడు. 'అరవింద సమేత' సినిమాతో బంపర్ హిట్ కొడతామనే ధీమా త్రివిక్రమ్, ఎన్టీఆర్‌లలో కన్పిస్తోంది.
ఈ సినిమా షూటింగ్ టైమ్‌లోనే ఈ ఇద్దరి మధ్యా స్నేహం పుట్టిందనుకుంటే పొరపాటే. ఈ ఇద్దరూ 'స్టూడెంట్ నెం.1' సినిమా టైమ్ నుంచీ మంచి స్నేహితులట. ఆ స్నేహం కారణంగా బలవంతంగా ఓ సినిమా సెట్స్ మీదకు రావడం ఇష్టం లేకనే, ఇద్దరూ సరైన కథ కోసం ఎదురుచూశారట. అలా 'అరవింద సమేత' సెట్స్ మీదకు వచ్చిందని చెబుతున్నాడు యంగ్ టైగర్.
ఇదిలా వుంటే, ఎన్టీఆర్ ఆర్స్ బ్యానర్‌లో కళ్యాణ్‌రామ్ ఓ సినిమాని త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నాడని సమాచారమ్. ఇది ఎన్టీఆర్ హీరోగానే వుంటుందని కూడా ఓ గాసిప్ విన్పిస్తోంది. అయితే 'అరవింద సమేత' రిలీజ్‌కి ముందు ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశం లేదుగానీ, సినిమా రిలీజయ్యాక ఖచ్చితంగా ఆ ప్రాజెక్ట్‌పై ప్రకటన రానుందని తెలుస్తోంది.
ఇప్పుడే ఈ అంశంపై ప్రకటన చేస్తే, అది పబ్లిసిటీ స్టంట్ అవుతుందనే బావనలో ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్, త్రివిక్రమ్ వున్నారట. అయితే త్రివిక్రమ్, అరవింద సమేత తర్వాత పలు కమిట్‌మెంట్స్‌తో వున్నాడు. అయినాగానీ, ఎన్టీఆర్ కోసం త్రివిక్రమ్ ఆ కమిట్‌మెంట్స్‌లో కొన్నిటినుంచి వెసులుబాటు కల్పించుకునే అవకాశమూ లేకపోలేదు. ఎన్టీఆర్ - కళ్యాణ్‌రామ్ కాంబినేషన్‌లో (ఎన్టీఆర్ హీరోగా కళ్యాణ్‌రామ్ నిర్మాతగా) 'జై లవ కుశ' సినిమా వచ్చిన సంగతి తెల్సిందే.