గ్లామ్‌షాట్‌: 'వర్కింగ్‌ మమ్మా' స్టిల్‌ అదిరిందమ్మా!

మరిన్ని వార్తలు

అందాల భామలు హాట్‌ హాట్‌ అందాలను ఆరేయడంలో ఎంత వినూత్నంగా ఆలోచిస్తున్నారో.. ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. పబ్లిసిటీ స్టంట్‌ కోసం ఆఖరికి బేబీ బంప్స్‌ని కూడా రంగంలోకి దించేశారు ఈ మధ్య కొందరు ముద్దుగుమ్మలు. అందులో మొదటి స్థానం సమీరారెడ్డిదైతే, ఆ తర్వాత స్థానం అమీజాక్సన్‌దే అని చెప్పక తప్పదు. 9 నెలల వరకూ డేంజరస్‌ ఫీట్స్‌ చేస్తూ, బేబీ బంప్‌ని ఎక్స్‌పోజ్‌ చేస్తూనే ఉన్న సమీరారెడ్డి ఇటీవలే ఓ ఆడబిడ్డని ప్రసవించింది. సో అలా సమీరా బేబీ బంప్‌ షో ముగిసింది.

 

ఇక ఇప్పుడు అమీజాక్సన్‌, ఈమె డెలివరీకి ఇంకా టైముంది. సో బేబీ బంప్‌తో స్టైలిష్‌గా ఫోటో సెషన్స్‌ చేయించుకుంటూ, హాట్‌ హాట్‌గా సోషల్‌మీడియాలో దర్శనమిస్తోంది. తాజాగా బ్లాక్‌ డ్రస్సులో బేబీ బంప్‌తో అమీ ఇచ్చిన స్టిల్‌ సింప్లీ సూపర్బ్‌. ఆమె ధరించిన థై హై స్లిట్‌ డ్రస్‌లో బేబీ బంప్‌ క్లియర్‌గా కనిపించడంతో పాటు, క్యూట్‌ అండ్‌ నాటీ గ్లామర్‌ కూడా బాగా ఎలివేట్‌ అవుతోంది. 'వర్కింగ్‌ మమ్మా' మెటర్నిటీ ఫోటో షూట్‌ అంటూ తాజాగా ఈ ఫోటోస్‌ని అమీజాక్సన్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. ఈ పిక్స్‌కి హ్యూజ్‌ రెస్పాన్స్‌ వస్తోంది. ఈ స్టైలిష్‌ వర్కింగ్‌ మమ్మాని చూసి మీరు కూడా ఓ లుక్కో లైకో వేస్కోండి బాస్‌.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS