ఆ స్పెషల్‌ సాంగ్‌లో ఈ తెలుగమ్మాయ్‌.!

By iQlikMovies - July 25, 2019 - 18:00 PM IST

మరిన్ని వార్తలు

'అభినేత్రి 2' సినిమాలో తమన్నా, నందితా శ్వేతతో పాటు, ప్రభుదేవా సరసన మరో అమ్మాయ్‌ కూడా హాట్‌ హాట్‌గా అందాలారబోసింది. ఆ అమ్మాయ్‌ మరెవరో కాదు, మన తెలుగమ్మాయ్‌ డింపుల్‌ హయాతీ. ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌తో హాట్‌ హాట్‌ స్టెప్పులేయనుంది. హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'వాల్మీకి' సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.

 

ఈ సినిమాలో ఓ స్పెషల్‌ సాంగ్‌ కోసం స్పెషల్‌గా తెలుగమ్మాయ్‌ని ఎంచుకున్నాడు మన క్రియేటివ్‌ డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌. ఇప్పుడు సినిమాల్లో స్పెషల్‌ సాంగ్స్‌ కామన్‌. కానీ, వాటి కోసం క్రేజీయెస్ట్‌ భామల్ని ఇతర భాషల నుండి దిగుమతి చేసుకోవడమో, లేక సొంత భాషలోనే పాపులర్‌ బ్యూటీస్‌ని ఎంచుకోవడమో జరుగుతున్న ఈ తరుణంలో హరీష్‌ శంకర్‌, అంతగా సుపరిచితురాలు కాని ఓ తెలుగమ్మాయికి ఛాన్స్‌ ఇవ్వడం విశేషం. డింపుల్‌ హయాతీ విషయానికొస్తే, అమ్మడు చాలా టాలెంటెడ్‌.

Image result for dimple hayathi

ఓ.. పెద్ద అందగత్తె అని చెప్పలేం కానీ, హాట్‌నెస్‌లో నో లిమిట్స్‌. ఎక్స్‌ప్రెషన్స్‌లో టాప్‌ లెవల్స్‌.. వంటి స్పెషల్‌ క్వాలిటీస్‌ బాగానే ఉన్నాయి. చూడాలి మరి ఈ స్పెషల్‌ సాంగ్‌ డింపుల్‌కి తెలుగులో మంచి పేరు తెచ్చి పెడుతుందేమో. ఈ సినిమాలో పూజా హెగ్దే హీరోయిన్‌గా నటిస్తోంది. తమిళ హీరో అధర్వ కీలక పాత్ర పోషిస్తున్నాడు. తమిళ బ్లాక్‌ బస్టర్‌ 'జిగర్తాండ'కు 'వాల్మీకి' రీమేక్‌ అన్న సంగతి తెలిసిందే.

Related image

ALSO READ : Valmiki Pre Teaser


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS