ఈ మధ్య అమీ జాక్సన్ పేరు తెగ మార్మోగిపోతోంది. నేను తల్లిని కాబోతున్నానోచ్.. అంటూ పెళ్లి కాకుండానే లివింగ్ రిలేషన్ షిప్‌లో ఉన్న తన బోయ్ ఫ్రెండ్‌తో కలిసి మరీ పబ్లిసిటీ చేసుకుంటోందీ బ్రిటీష్ అందాల సుందరి.
'రోబో 2.0'లో క్యూట్ రోబో 'వెన్నెల' పాత్రలో అందర్నీ ఆకట్టుకుంది. చిట్టి రోబో కన్నా, ఈ వెన్నెల రోబోకే ఎక్కువ మార్కులు పడ్డాయి ఈ సినిమాతో. ఇకపోతే ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చి, పర్సనల్ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తున్న అమీ జాక్సన్ తన పర్సనల్ లైఫ్‌కి సంబంధించిన ఆశక్తికరమైన విషయాల్ని అభిమానులతో షేర్ చేసుకుంటూ స్పెషల్ కిక్ ఫీలవుతోంది. మొన్నటి వరకూ బేబీ బంప్స్‌తో ఫోటోలు, వీడియోలతో తన ఇన్‌స్టాగ్రామ్‌ని నింపేసిన అమీ జాక్సన్ తాజాగా వైట్ అండ్ వైట్ కాస్ట్యూమ్‌లో దర్శనమిచ్చింది.
టాప్ టూ బోటమ్ ట్రాన్స్‌పరెంటెడ్ లుక్‌లో సెక్సీ అప్పీల్ ఇస్తూ కుర్రకారు గుండెలకు సన్నగా గాయం చేస్తోంది.