'మన్మధుడు 2'లో సమంత పాత్ర ఏంటో తెలుసా.?

మరిన్ని వార్తలు

నాగార్జున తాజా చిత్రం 'మన్మధుడు 2'లో అక్కినేని కోడలు సమంత కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసినప్పటి నుండీ, ఆ పాత్ర ఏంటనే విషయంపై సర్వత్రా ఆశక్తి నెలకొంది. అయితే ఆ పాత్రను సినిమా రిలీజ్‌ అయ్యే వరకూ సస్పెన్స్‌గానే ఉంచాలన్నది చిత్రయూనిట్‌ నిర్ణయమట.

 

ఖచ్చితంగా సినిమాకి కీ రోలే కానీ, విడుదల వరకూ ఆ రోల్‌ని రివీల్‌ చేయరట. రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రకుల్‌ ప్రీత్‌సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. రాహుల్‌తో సమంతకు మంచి స్నేహం ఉంది. మామగారు నాగార్జున అంటే ఫ్యామిలీ పరంగానూ, ప్రొఫిషనల్‌గానూ అమితమైన అభిమానం, గౌరవం ఉన్నాయి. సో ఇన్ని కారణాలతో సమంత ఈ సినిమాలో తన పాత్ర గురించి తెలియకుండానే ఓకే చేసిందట. ప్రస్తుతం పోర్చుగల్‌లో ఈ సినిమా షూటింగ్‌ జరుపుకుంటోంది. ఇదిలా ఉంటే, సినిమాపై రకరకాల రూమర్లు సర్క్యులేట్‌ అవుతున్నాయి. 'మన్మధుడు 2' షూటింగ్‌ చాలా స్లోగా జరుగుతోందనీ, రకుల్‌పై తెరకెక్కిస్తున్న సన్నివేశాల అవుట్‌పుట్‌ ఆశించిన విధంగా రాని కారణంతో నాగార్జున లోలోపల గుస్సా అవుతున్నారనే ప్రచారం జరుగుతోంది.

 

కానీ అలాంటిదేమీ లేదనీ, షూటింగ్‌ సాఫీగా జరుగుతోందనీ, అవుట్‌ పుట్‌ చాలా బాగా వస్తోందనీ రాహుల్‌ రవీంద్రన్‌ తెలిపారు. వీలైనంత ఎర్లీగా ఈ సినిమాని పూర్తి చేయాలనే యోచనలో టీమ్‌ అంతా కష్టపడి పని చేస్తోందని రాహుల్‌ తెలిపారు. ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌తో కలిసి నాగార్జున ఈ సినిమాని నిర్మిస్తున్నారు. 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS