ఫిగర్‌ని ఫిట్‌గా ఉంచుకునేందుకు ముద్దుగుమ్మలు పడరాని పాట్లు పడుతూంటారు. బ్రిటీష్ భామ అమీజాక్సన్ ఇటీవలే ఓ బిడ్డకి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. బిడ్డకి జన్మనివ్వడంతో కాస్త లూజ్‌గా మారిన తన బాడీని కసరత్తులతో మళ్లీ పూర్వ రూపంలోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఆ క్రమంలో లేటెస్ట్గా ఆ వర్కవుట్ ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, కొన్ని యోగా టిప్స్నీ సూచిస్తోంది. సహజంగా మాతృత్వం తర్వాత ప్రతీ మహిళ ఎదుర్కొనే సమస్యే ఇది. కానీ, మాతృత్వాన్ని ఎంత అమితంగా స్వీకరిస్తామో, ఆ తర్వాత షేప్ కోల్పోయిన మన శరీరాన్ని కూడా అంతగానే ప్రేమించాలి. కాస్త దృష్టి పెడితే, కోల్పోయిన ఫిట్నెస్ తిరిగి పొందడం ఏమంత కష్టమైన పని కాదు.. అని అమీజాక్సన్ చెబుతోంది.
ఇకపోతే, లేటెస్ట్ పిక్ చూస్తున్నారుగా.. బేబీ పింక్ టాప్ అండ్ వైట్ కలర్లో షార్ట్ ధరించి నేలపై బాడీ ని విల్లులా ఎలా వంచేసిందో.. ఓ చేయి, ఓ కాలిపై బాడీని పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేసింది. ఈ బ్యాలెన్సింగ్‌కి బాల్కనీని ఎంచుకోవడంతో సన్న సన్నగా సన్ రేస్ కూడా పడుతోంది. బాడీకి కావల్సిన ‘డి’ విటమిన్ కూడా అందుతుంది మరి. సో బ్యూటిఫుల్ అండ్ సో హెల్దీ కదా.