ఆ రూమర్స్‌ని ఖండించిన మిల్కీ బ్యూటీ!

మరిన్ని వార్తలు

మిల్కీ బ్యూటీ తమన్నా పని అయిపోయిందంటూ ఈ మధ్య సోషల్‌ మీడియాలో పనీ పాటా లేని కొందరు ఆకతాయిలు ఆట పట్టిస్తున్నారు. వారి పైత్యం మరీ ఎక్కువయిపోవడంతో, ఈ రూమర్‌పై మిల్కీ బ్యూటీ స్పందించాల్సి వచ్చింది. ఖాళీగా ఉన్నానంటూ తనపై వస్తున్న వార్తల్లో నిజం ఎంత మాత్రమూ లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం మిల్కీ బ్యూటీ తెలుగులో ‘సిటీ మార్‌’ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా కెరీర్‌లో తనకెంతో స్పెషల్‌ అని చెబుతోంది. గ్లామర్‌ తారగా ఎన్నో కమర్షియల్‌ హిట్స్‌ అందుకున్న తమన్నా, పర్‌ఫామెన్స్‌ ఓరియెంటెడ్‌ రోల్స్‌తోనూ ఆకట్టుకుంది.

 

అయితే, ఇంతవరకూ స్పోర్ట్స్‌ బ్యాక్‌ డ్రాప్‌లో సినిమా చేయలేకపోయానే వెలితి ఈ సినిమాతో తీరిపోతోందని చెప్పుకొచ్చింది. ఈ సినిమాలో తమన్నా కబడ్డీ కోచ్‌గా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణా మహిళా కబడ్డీ టీమ్‌కి కోచ్‌గా తమన్నా నటిస్తోంది. అలాగే, ఆంధ్రా జట్టుకు గోపీచంద్‌ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. సంపత్‌ నంది దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఇప్పటికే కొంత మేర షూటింగ్‌ జరుపుకుంది. కరోనా కారణంగా తాత్కాలిక బ్రేక్‌ తీసుకోవడంతో ప్రస్తుతం తమన్నా హోమ్‌ క్వారంటైన్‌లో ఉంది. ఇంటి వద్దనే వర్కవుట్స్‌ చేస్తూ, తల్లికి ఇంటి పనిలో హెల్ప్‌ చేస్తూ, కాలక్షేపం చేస్తోంది. మధ్య మధ్యలో కొన్ని కొత్త విషయాల్ని నేర్చుకోవడంలోనూ తమన్నా ఆసక్తి చూపిస్తోందట.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS