గ్లామ్ షాట్ అందాల వల వేసి, అమాంతం మాయ చేసి.

By Inkmantra - May 15, 2020 - 18:00 PM IST

మరిన్ని వార్తలు

గ్లామర్ వల విసరడంలో అందాల భామ అమైరా దస్తూర్ కి అఫీషియల్ గా డిగ్రీ పట్టా ఉంది. ఉండాల్సిన అందాల కొలతలన్నీ ఉండాల్సిన పాళ్లలో ఉన్నప్పటికీ, ఈ ముద్దుగుమ్మకి సినిమాల్లో రావల్సిన గుర్తింపు రావడం లేదు. తెలుగులో ‘మనసుకు నచ్చింది’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించింది. తొలి పరిచయంతో ఆడియన్స్ ని మెప్పించలేకపోయింది. ఆ తర్వాత ‘రాజుగాడు’ సినిమాలో నటించింది. కానీ, ద్వితీయ విఘ్నాన్నీ చవి చూసింది. ఆ పై మరో అవకాశం చేజిక్కించుకోలేకపోయింది.

 

బాలీవుడ్లో లక్ టెస్ట్ చేసుకుంది. కానీ, అక్కడా అరా కొరా అవకాశాలే. కానీ, సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్ ఫాలోయింగ్ సంపాదించింది. హాట్ హాట్ వర్కవుట్స్ చేస్తూ, ఆ పిక్స్ పోస్ట్ చేస్తుంటుంది. అలా విపరీతంగా ఫాలోవర్స్ ని సంపాదించింది. ఆ ఫాలోయింగ్ కోసమే, లేటెస్ట్ గా ఓ హాట్ అండ్ క్యూట్ పిక్ పోస్ట్ చేసింది. వైట్ కలర్ లేస్ ప్యాటర్న్ లో ఓ మినీ ఫ్రాక్ ధరించి, నేలపై కూర్చుంది. ఎటో చూస్తూ ప్లెజెంట్ గా ఫోటోకి పోజిచ్చింది. లాక్ డౌన్ కదా.. స్వీట్ హోమ్, స్టే హోమ్ అనే క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఇంత స్వీట్ గా ఈ హాటీ సెలవిస్తే ఆమె ఫాలోవర్స్ ఫాలో చేయకుండా ఉంటారా.? చెప్పండి.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Home Sweet Home 🙏🏻

A post shared by Amyra Dastur (@amyradastur93) on


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS