మెగా ఫ్యామిలీ నుండి మొట్టమొదటి హీరోయిన్గా తెరంగేట్రం చేసిన నిహారికకు, తొలి సినిమా ‘ఒక మనసు’ నిరాశనే మిగిల్చింది. ఆ తర్వాత నటించిన రెండు సినిమాలూ నిహారికకు హీరోయిన్గా నిలదొక్కుకునే అవకాశాన్ని ఇవ్వలేకపోయాయి. దాంతో, ఇక సినిమాలకు టెంపరరీ బ్రేక్ ఇచ్చి, వెబ్ సిరీస్ పై ఫోకస్ పెట్టింది. అక్కడ తనదైన శైలిలో దూసెకెళ్లిపోతోంది. అయితే, త్వరలోనే నిహారిక వెండితెరపై మళ్లీ కనిపించబోతోందనే గుడ్ న్యూస్ ఫ్యాన్స్ లో ఉత్సాహం నింపింది. అంటే, నిహారిక కెరీర్ మళ్లీ గాడిన పడుతుందని ఫ్యాన్స్ భావించారు. ఈ లోగా నిహారిక తండ్రి మెగా బ్రదర్ నాగబాబు, నిహారిక పెళ్లంట అనే న్యూస్ రివీల్ చేసి, అందరికీ షాకిచ్చారు.
పెళ్లయితే, సినిమాలకు బ్రేక్ అప్ చెప్పేస్తానని నిహారిక గతంలోనే చెప్పింది. అంటే, నిహారిక కెరీర్ కి ఇక ఫుల్ స్టాప్ పెట్టేసినట్టేనా.? అంటే అవుననే అనుకోవాలి. మొదట ఈ ఏడాదిలోనే నిహారిక పెళ్లి ఉంటుందని చెప్పిన నాగబాబు, తర్వాత వచ్చే ఏడాది మార్చి, కానీ, ఏప్రిల్ లో కానీ, నిహారిక వివాహం పక్కా అని తేల్చేశారు. ఆ తర్వాత వరుణ్ తేజ్ వివాహం గురించి కూడా ఆలోచిస్తామని ఆయన తెలిపారు. ఇప్పటికే సంబంధాలు చూస్తున్నామనీ, లాక్ డౌన్ ఎత్తేయగానే, నిహారికకు తగిన వరుడ్ని వెతికే పనిని మరింత వేగవంతం చేస్తామని ఆయన అన్నారు. ఈ తతంగమంతా ఇలా ఉంటే, మరోవైపు ఫ్యాన్స్ మాత్రం నిహారికకు ఏమంత వయసొచ్చిందనీ, అప్పుడే పెళ్లి చేసేందుకు.. అని ఫ్యాన్స్ సలహాలిస్తున్నారట.