మనసుకు నచ్చే స్పైసీ గ్లామర్‌!

By iQlikMovies - April 16, 2018 - 10:49 AM IST

మరిన్ని వార్తలు

ఇటీవలే 'మనసుకు నచ్చింది' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన అందాల భామ అమైరా దస్తూర్‌. అందానికి అందం, హీటెక్కించే హాట్‌నెస్‌ అన్నీ ఉన్నా, ఈ ముద్దుగుమ్మకి సరైన హిట్టే దక్కడం లేదు. అందాల ఆరబోతలో అమ్మడికి తనకు తానే పోటీ. డిఫరెంట్‌ ఫోటో సెషన్స్‌తో ఎప్పటికప్పుడే సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఈ మధ్య కాస్త జోరు తగ్గిన అమైరా అందాల దాడి మళ్లీ మొదలైందని చెప్పకనే చెబుతోంది ఇదిగో ఈ తాజా ఫోటోతో. బ్లూ కలర్‌ నెటెడ్‌ పేటర్న్‌ కాస్ట్యూమ్‌తో అమైరా దస్తూర్‌ గ్లామర్‌ మెరిసిపోతోంది ఈ ఫోటోలో. 'మనసుకు నచ్చింది' సినిమాతో హిట్‌ కొట్టి, టాలీవుడ్‌లో పాతుకుపోదామని గంపెడు ఆశతో వచ్చింది కానీ, వర్కవుట్‌ కాలేదు. ఆశించిన రిజల్ట్‌ రాలేదు. దాంతో రేస్‌లో అడుగుపెట్టలేకపోయిందీ క్యూట్‌ భామ. అవకాశాల కోసం తన వంతు కృషి చేస్తానంటోంది. ఛాన్సంటూ వస్తే, దేన్నీ వదలనంటోంది ముద్దులొలికే మోమున్న అమైరా దస్తూర్‌.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS