మహేష్‌కి ఇప్పుడు కత్తి మీద సామే. ఆ మాటకొస్తే, మహేష్‌కేంటి, తర్వాత రాబోయే బన్నీకి కూడా. ప్రస్తుతం మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న 'భరత్ అనే నేను' చిత్రం తన సత్తా చాటుకోవాల్సిన అవసరం ఉంది.
కమర్షియల్‌కి దూరంగా పల్లెటూరి నేపథ్యంలో వచ్చిన 'రంగస్థలం' సినిమా దూకుడు ఎలా ఉందో చూస్తున్నాం. సినిమా విడుదలై మూడు వారాలు గడుస్తున్నా, 'రంగస్థలం' ప్రదర్శితమవుతోన్న ధియేటర్స్ ఇంకా హౌస్‌ఫుల్స్‌నే నమోదు చేస్తున్నాయి. రిపీట్ ఆడియన్స్ ఎక్కువగా ఉన్నారు ఈ సినిమాకి. ఈ మూడు వారాల గ్యాప్‌లో మధ్యలో రెండు సినిమాలు వచ్చాయి. కానీ 'రంగస్థలం' హౌస్ ఫుల్స్‌ని ఆపడం ఎవ్వరి తరం కావట్లేదు.
ఇకపోతే మరో నాలుగు రోజుల్లో 'భరత్ అనే నేను' సినిమా రిలీజ్ కానంది. ఓవర్సీస్ మొనగాడుగా మహేష్‌ని అభివర్ణిస్తారు. అయితే 'రంగస్థలం'తో ఆ హ్యాష్‌టాగ్‌ని చరణ్ లాగేసుకున్నాడు. దాంతో మహేష్‌కి 'భరత్ అనే నేను' చిత్రం అగ్ని పరీక్షలా మారింది. ఓవర్సీస్ మార్కెట్ సంగతి అటుంచితే, ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా మహేష్ తానేంటో నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. 'శ్రీమంతుడు' తర్వాత మహేష్‌కి ఆ స్థాయిలో హిట్ పడలేదు.
'బ్రహ్మూెత్సవం' డిజాస్టర్, భారీ అంచనాల నడుమ వచ్చిన 'స్పైడర్' కూడా బెడిసి కొట్టడంతో ఈ సినిమాపైనే మహేష్ ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. కాంబినేషన్ పరంగా చూస్తే, కొరటాల శివ - మహేష్ కాంబినేషన్‌లో వస్తోన్న ఈ సినిమా పక్కాగా హిట్ కొట్టి తీరాలంతే. ఏమో ఏం జరుగుతుందో మరి కొద్ది రోజుల్లోనే తేలిపోనుంది.