అందాల సమీరం.. అన్పిస్తోంది కదూ ఈ బ్యూటీని చూస్తోంటే. ఇందులో 'పరదా' ఎక్కడుంది? ఇంకెక్కడ, ఆమె కాస్ట్యూమ్‌ని పరిశీలిస్తే.. ఉల్లిపొర లాంటి వస్త్రం వేసీ వేసుకోనట్టుగా కిర్రాకు పుట్టించేస్తోంది ఈ బ్యూటీ అనే విషయం అర్థమవుతుంది. టూ పీస్ బికినీలో అయినా, టాప్‌లెస్ పోజులతో అయినా కుర్రకారు గుండెల్లో హీట్ పుట్టించేయడంలో అమైరా తర్వాతే ఎవరైనా. తెలుగులో ఈ బ్యూటీ చేసింది ఒక్క సినిమానే. ఆ సినిమా నిరాశపర్చడంతో మళ్ళీ ఈ అందాల భామ తెలుగు తెరపై కన్పించలేదు. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా వుంది. ఒక్క సక్సెస్ దొరికితే చాలు, తానేంటో నిరూపించుకుంటానంటోన్న అమైరా, సెక్సప్పీల్ వేసుకున్న దుస్తుల్లో కాదు.. కళ్ళల్లో వుంటుందని చెబుతోంది. కళ్ళల్లో సెక్సప్పీల్ సంగతేమోగానీ.. ఉల్లిపొర చాటున అందాల్ని ప్రదర్శనకు పెట్టాక.. ఆమె సెక్సప్పీల్‌ని ఎవరన్నా గుర్తించకుండా వుంటారా?