ట్రైలర్‌ రివ్యూ: అల్లుడు అదరగొట్టేశాడంతే

By iQlikMovies - August 31, 2018 - 17:05 PM IST

మరిన్ని వార్తలు

అక్కినేని నాగేశ్వరరావు నుంచి అక్కినేని నాగార్జున వరకు.. వెండితెరపై చూపించే ఆ ఎనర్జీకి అక్కినేని అభిమానులు ఎప్పుడూ ఫిదా అవుతూనే వుంటారు. ఎనర్జీ విషయంలో అక్కినేని యంగ్‌ తరంగ్‌ నాగచైతన్య, అఖిల్‌ ఏమాత్రం తాము తక్కువ కాదనే విషయం ప్రతి సినిమాతోనూ ప్రూవ్‌ చేస్తూనే వున్నారు. 

తాజాగా 'శైలజారెడ్డి అల్లుడు' ట్రైలర్‌లో నాగచైతన్య ఎనర్జీని చూస్తే 'వారసత్వం సుమీ..' అన్పించకమానదు. మారుతి దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా నటించిన సినిమా 'శైలజారెడ్డి అల్లుడు'. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా విడుదలైన ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. 'ఈగో' అత్త, అల్లుడు మధ్య ఎలాంటి ఫన్‌ని, యాక్షన్‌నీ, ఎమోషన్స్‌నీ జనరేట్‌ చేసిందో ఈ సినిమాలో మారుతి చూపించబోతున్నాడు. 

అత్తే అనుకుంటే, అత్త కూతురు కూడా ఇగో విషయంలో ఏమాత్రం తక్కువ కాదు. రమ్యకృష్ణ, అనూ ఇమ్మాన్యుయేల్‌ బాడీ లాంగ్వేజ్‌ సినిమా కాన్సెప్ట్‌కి పెర్‌ఫెక్ట్‌గా సెట్‌ అయినట్టే వుంది. చైతూ తగ్గుతాడా.? నేనేం తక్కువ.. అంటూ చెలరేగిపోయాడు. పక్కా మాస్‌ అనేలా యాక్షన్‌ ఎపిసోడ్స్‌లో దుమ్ము రేపేశాడు. 

డిఫరెంట్‌ లుక్‌తో 'శైలజారెడ్డి అల్లుడు'గా అక్కినేని బుల్లోడు చేస్తోన్న సందడి వెండితెరపై ఇంకెలా వుండబోతోందో తెలియాలంటే ఇంకొద్ది రోజులు వేచి చూడాల్సిందే. 

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS